SGX NIFTY @ 15,906…నిఫ్టీ గ్యాప్ అప్? సానుకూలంగా గ్లోబల్ సూచీలు

దేశీయంగా, అంతర్జాతీయంగా అందుకున్న సంకేతాలతో గరిష్టాల్లో ఆల్ టైం హైలో ట్రేడ్ అయిన మార్కెట్లు లాభాల స్వీకరణతో పాటు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవ్వడంతో నిన్నటి ట్రేడింగ్ స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండటంతో ఈ రోజు సింగపూర్ నిఫ్టీ 140 పాయింట్లకు పైగా లాభంతో 15,899 వద్ద ట్రేడ్ కొనసాగుతుంది. అదే విధంగా రేపు రిలయన్స్ ఎజీఎం మీటింగ్ వుండనుండటంతో రిలయన్స్ షేరులో లాభాల్లో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ రోజు కూడా మార్కెట్లు గరిష్ఠాల్లో ట్రేడ్ కొనసాగి రికార్డులను నిలుపుకునే దిశగా సూచీలు ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

AllcargoApollo HospitalGrandeur Prod
Jeevan ScientSchneider InfraVanta Bioscienc

 

న్యూస్ స్టాక్స్:

శోభా: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ శోభా మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ .1790 కోట్లకు 64.69 శాతం తగ్గింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 77.87 శాతం తగ్గి 62.30 కోట్లకు చేరుకుంది. రియల్ ఎస్టేట్ డెవలపర్ బోర్డు ఒక్కో షేరుకు 3.5 రూపాయల తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసింది.

అవంతి ఫీడ్: అవంతి ఫీడ్స్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 19.88% తగ్గి 69.69 కోట్లకు పరిమితమైంది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 3.92 శాతం పెరిగి 360.07 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా అవంతి ఫీడ్స్ బోర్డు ఒక్కో షేరుకు తుది డివిడెండ్‌ను రూ .6.25 ప్రకటించింది.

మిండా ఇండస్ట్రీస్: ప్రముఖ ఆటో మొబైల్ విడిభాగాల తయారీదారు మిండా ఇండస్ట్రీస్ ఉజికిస్తాన్ చెందిన ఉజ్కాసిస్ సంస్థలో 51శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ సుమారు 558 కోట్లు వుంటుందని కంపెనీ తెలిపింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Apollo Hospitals, Minda Industries, GE Power, GodrejAgro, NMDC.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,650, రెసిస్టెన్స్ లెవెల్ 34,930 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,750 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,815 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *