నిఫ్టీ 15,500 దిశగా దూసుకెళ్తుందా? గరిష్ఠ స్థాయిలో సింగపూర్ నిఫ్టీ

అంతర్జాతీయంగా సానుకులంగా బలమైన సంకేతాలు, అమెరికాలో ఉద్దీపన పథకాలు, పీడబ్ల్యూసీ సిఈఓల ఎకానమీ సర్వేలు పాజిటవ్ గా ఉండటంతో మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అలాగే సింగపూర్ నిఫ్టీ 52 వారాల గరిష్ఠ స్థాయిలో 15,420 వద్ద ట్రేడ్ అవ్వడంతో ఈ రోజు ఇండియాన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగే అవకాశం ఉంది.

 

న్యూస్ స్టాక్స్:

ఆస్తులు విక్రయించిన ప్రెస్టేజ్: రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ ప్రెస్టేజ్ తన ఆస్తులను సుమారు 7,467 కోట్లకు బ్లాక్ స్టోన్ కు విక్రయించింది.

చోళమండలం ఫైనాన్స్: తమ ఫైనాన్స్ వ్యాపారాన్ని దేశంలో వివిధ ప్రాంతాలకు విస్తరించే దిశగా చోళమండలం ఫైనాన్స్ కరూర్ వైశ్యా బ్యాంక్ తో బాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.

ఎన్ఎండిసి: ఒక్కో షేరుకు రూ.7.76 చొప్పున డివిడెంట్ ఇవ్వనున్నట్లు ఎన్ఎండిసి తెలిపింది. దీనికి గాను ఈ నెల 23వ తేదీని రికార్డు తేదీగా నిర్ణయించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Cholamandalam Finance, Blackstone Inc, HDFC Housing, Shipping Corporation of India, Axis Bank, Sun Pharma, Infosys

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,650 గా, రెసిస్టెన్స్ లెవెల్ 37,400 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,080 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,390 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గ్లోబల్ మార్కెట్ల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అలాగే ఆర్థిక గణాంకాలు, సర్వేలు కూడా పాజిటివ్ ఉండటంతో మార్కెట్లు దూసుకుపోతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ ను గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

 

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *