కాన్సొలేడేట్ దిశగా మార్కెట్లు…వెంటాడుతున్న కరోనా భయాలు

ఇండియాన్ స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో రోజు కూడా అమ్మకాల మోతతో నష్టాలు చవిచూస్తుంది. అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం పాజటివ్ గా ఉన్నప్పటికీ మన మార్కెట్లకు ఊరట లభించలేదు. దీనికి తోడు కరోనా కేసులు అధికమవ్వడం, బాండ్ ఈల్డ్స్ 14 వారాల గరిష్ట స్థాయికి చేరడంతో మదుపరులు భయందోళనలకు గురై అన్ని రంగాల షేర్లను అమ్మేస్తున్నారు.

 న్యూస్ లో ఉన్న స్టాక్స్

భారతీ ఎయిర్టెల్ : ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ ఆఫ్రికాలో గ్లోబల్ ఇన్విస్ట్ మెంట్ సంస్థ టిపిజి రూ.1,450 కోట్ల రూపాయలు పెడుతున్నట్లు సంస్థ తెలిపింది. ఆఫ్రికా విభాగానికి చెందిన మోబైల్ మనీ బిజినెస్ లో ఈ నిధులు ఖర్చు చేయనున్నటుల్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

దాల్మియా భారత్ : దాల్మియా భారత్ దాల్మియా ఉత్సవ్ పేరుతో షూగర్ రిటైల్ విభాగంలోకి ప్రవేశించింది. వినియోగదారులకు అత్యంత నాణ్యమైన చక్కెరను అందించే దిశగా తమ  కార్యకలాపాలు ఉంటయాని కంపెనీ తెలిపింది.

అదానీ గ్రీన్: నిర్మాణంలో ఉన్న ఇంధన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు గాను అంతర్జాతీయంగా 12 బ్యాంకుల నుంచి సుమారు రూ.9,800 కోట్లు భారీ రుణ సేకరణ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Adani Greens, Bharati Airtel, Dalmia Bharath, Welspun india,Dilip Buildcon, Tata Motors, M&M.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 33,550 గా, రెసిస్టెన్స్ లెవెల్ 34,700 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,300 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,725 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ గమనం ఎటువైపు…

బాండ్ ఈల్డ్స్ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ల లో అంతగా లేనప్పటికీ మన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.అలాగే కరోనా భయందోళనలతో FIIs & DIIs మదుపరుల అమ్మకాలు పెరిగాయి. సింగపూర్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడవ్వడంతో ఈ రోజు కూడా మార్కెట్లు ఇంకా పడే ధోరణియే కనపడుతుంది కాబట్టి మార్కెట్ మూమెంట్ ను జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడే చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *