ఊగిసలాట దిశగా మార్కెట్లు? నష్టాల్లో అమెరికా మార్కెట్లు

ఇంకా స్టాక్ మార్కెట్స్ లో నష్టాల పరంపర కొనసాగేలా వుంది. గత వారం మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవ్వడం తెలిసిన విషయమే. అలాగే గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవ్వడంతో ఈ వారం కూడా మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులతో సాగే అవకాశం ఉంది.

న్యూస్ లో ఉన్న స్టాక్స్:

రిలయన్స్ ఇండస్ట్రీస్: సాంకేతికత పరిశోధన సంస్థ స్కైట్రాన్ లో రూ.197 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ తెలిపింది. దింతో తమ వాటా ఈ సంస్థలో 54.46శాతానికి చేరిందన్నారు.

ఐఓసి : తమ రిఫైనరీ ప్లాంట్స్ విస్తరించే దిశగా రూ.32,946 కోట్ల రూపాలయల పెట్టుబడులను పెడుతున్నట్లు కంపెనీ తెలిపింది.

అఫెల్ ఇండియా: కంపెనీ డైరెక్టర్ల బోర్డు మీటింగ్ లో రూ.1,080 కోట్ల రూపాయల సమీకరణకు ఆమోదం తెలిపినట్లు కంపెనీ తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Reliance Industries, Dilip Buildcon, IOC, Affle India, Tata Chemicals, Zensar Technologies. KSB.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

సింగపూర్ నిఫ్టీ 14,725 వద్ద 95 పాయింట్లతో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాల అనుగుణంగా ఈ రోజు ఇండియాన్ మార్కెట్లు కన్సొలేడేషన్ లో ఉండే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,520 గా, రెసిస్టెన్స్ లెవెల్ 34,980 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,380 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,620 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇండియా జిడిపి కొద్దిగా మెరుగ్గా ఉండటంతో దీని ప్రభావం ఈ రోజు మార్కెట్ పై సానుకూలంగా ఉండొచ్చు. మార్కెట్ మూమెంట్ గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *