నిఫ్టీ గ్యాప్ ఆప్? మార్కెట్ సెంటిమెంట్ ఎటువైపు…

గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవ్వడంతో ఈ రోజు దేశీ స్టాక్ మార్కెట్లు నిఫ్టీలో గ్యాప్ ఆప్ ఉండే అవకాశం ఉంది. అదే విధంగా అంతర్జాతీయంగా ప్రతికూల ధోరణి కూడా కనబడుతుంది. అగ్ర రాజ్యం అమెరికాలో బాండ్ ఈల్డ్స్ రాబడులు పెరగటం, చమురు ధరలు పెరిగిపోతుండటం, ఫెడ్ రిజర్వు సమావేశాలు వీటిపై కూడా మార్కెట్ కదలిక ఆధారపడి ఉంటుంది.

 

న్యూస్ స్టాక్స్:

సయాజి హోటల్స్: హోటల్స్ విస్తరణ దిశగా ఏడు నగరాలలో వివిధ ప్రాంతాలలో ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది.

పివిఆర్: మైసూర్ లో నూతనంగా సుమారు 32,240 అడుగుల విస్తీర్ణంలో 1,078 మంది సామర్థ్యం కలిగే థియేటర్లను ప్రారంభిస్తున్నట్లు పివిఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.

తేజస్ నెట్ వర్క్: గిగ్ నెట్, మెక్సికో దేశానికి చెందిన డిజిటల్ ఇన్ఫ్ర స్టేక్చర్ కంపెనీ నుంచి  తమకు భారీ ఆర్డరు లభించినట్లు సంస్థ తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

PVR, Ashoka Buildcon.Tejas Network, Sayaji Hotels, Aarati Drugs, NMDC, Coal India.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,500 గా, రెసిస్టెన్స్ లెవెల్ 36,420 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,860 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,250 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

గ్లోబల్ మార్కెట్లు కొద్దిగా సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాప్పటికీ అంతర్జాతీయంగా వివిధ ప్రతికూల అంశాలు మార్కెట్ సెంటిమెంట్ ని ఎటువైపు నడిపిస్తాయో వేచి చూడాలి.  కాబట్టి మార్కెట్ మూమెంట్ ను గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

 

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *