లాభాలకు బ్రేక్! అమ్మకాల ఒత్తిడిలో గ్లోబల్ మార్కెట్లు

గత మూడు రోజులుగా వరుస లాభాలతో రాణించిన స్టాక్ మార్కెట్లు నిన్నటి ట్రేడింగ్ సెషన్లో ఫైనాన్స్, ఇంధన, ఐటీ షేర్ల లో అమ్మకాల ఒత్తిడి తలెత్తింది. దీనితో సెన్సెక్స్ 599 పాయింట్లు, నిఫ్టీ 165 పాయింట్లను నష్ట పోయింది. అమెరికాలో బాండ్ ఈల్డ్స్ రాబడులు మళ్లీ పెరగడం, లాభాల స్వీకరణ, అంతర్జాతీ ప్రతికూల అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.  ఈ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ రోజు మార్కెట్లు కన్సాలిడేషన్ జోన్లో ఉండే అవకాశం ఉంది.

న్యూస్  స్టాక్స్:

విప్రో అతి పెద్ద డీల్ : ప్రముఖ అంతర్జాతీయ మల్టీ నేషనల్ ఐటీ దిగ్గజం రూ.10,500 కోట్ల రూపాయలు వెచ్చించి గ్లోబల్ మేనేజ్ మెంట్ టెక్నాలజీ కన్సల్టెన్సీ క్యాప్ కోను కొనుగోలు చేయనున్నట్లు అలాగే విప్రో చరిత్రలోనే ఇది అతి పెద్ద డీల్ అని కంపెనీ తెలిపింది.

ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ : విదేశీ కరెన్సీ కన్వెర్టబుల్ బాండ్ల ద్వారా సుమారు రూ.1091 కోట్ల రూపాయలు సమీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Wipro, HCL Tech, Infosys, India Bulls Housing Finance, RailTel Corp, Ashoka Buildcon.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,050 గా, రెసిస్టెన్స్ లెవెల్ 36,600 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,850 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,250 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గ్లోబల్ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ ను గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *