వాలటల్టీ దిశగా మార్కెట్లు! జోరులో ఆటో, ఐటీ రంగ షేర్లు

మార్కెట్లు లాభాల దిశగా కొనసాగుతున్నాయి. ఆటో మోబైల్ మరియు ఐటీ రంగ షేర్లు నిన్నటి మార్కెట్లో మదుపరులకు మంచి లాభాలనిచ్చాయి. తీవ్ర హెచ్చు తగ్గుల మధ్యే ట్రేడ్ అయినా చివరి గంటలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ దూసుకెళ్ళాయి.

 

న్యూస్ లో ఉన్న స్టాక్స్:

ఇండియన్ బ్యాంక్ : నిన్నటి ఈజీఎం మీటింగ్ లో రూ.4000 కోట్ల మూలధన సమీకరణకు వాటాదారుల నుంచి అనుమతి కోరినట్లు బ్యాంక్ తెలిపింది.

భారతీ ఎయిర్ టెల్: స్పెక్ట్రమ్ వేలంలో రూ.18,699 కోట్ల విలువ చేసే స్పెక్ట్రం కొనుగోలు చేసింది.

ఇంజినీర్స్ ఇండియా: ఇండియా ఆయిల్ కార్పొరేషన్ నుంచి సుమారు 600 కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ పనులు తమకు లభించినట్లు కంపెనీ తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Engineers India, Jindal Steel, Adani Ports, Bharati Airtel

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35000 గా, రెసిస్టెన్స్ లెవెల్ 36,200 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,800 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,110 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు నిన్నటి ట్రేడింగ్ షెషన్లో ఒక మాదిరిగా ఫ్లాట్ గా అలాగే అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. కాబట్టి మార్కెట్ మూమెంట్ ను గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *