లాభాల బాటలో మార్కెట్లు! ఆటో సెక్టార్ ఆదుర్స్

ఇండియాన్ జీడీపీ గణాంకాలు మెరుగ్గా ఉండటం, ఆటో సెక్టార్ అమ్మకాలు ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో నమోదు కావడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవ్వడంతో మన మార్కెట్లు ఈ రోజు కూడా బుల్ రేస్ లో దూసుకుపోయే అవకాశాలున్నాయి.

న్యూస్ లో ఉన్న స్టాక్స్:

గోద్రేజ్ ప్రోపర్టీస్ : ముంబయిలో సుమారు రూ.166 కోట్ల విలువ చేసే స్థలాన్ని ఇళ్ల నిర్మాణానికి కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది.

బిపిసియల్ : ప్రైవేటీకరణలో భాగంగా ప్రభుత్వరంగా సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తనకున్న అతిపెద్ద నుమాలిగఢ్ రిఫైనరీని అస్సోం ప్రభుత్వ కన్షారియమ్ కు రూ.9,876 కోట్లకు విక్రయించనట్లు సంస్థ తెలిపింది.

ఆటో సెక్టార్ ఫిబ్రవరి ఫలితాలు ఆదుర్స్: కొవిడ్ కారణంగా వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ పెరగడంతో ఆటో సెక్టార్ లో ఫిబ్రవరిలో కూడా అమంతం పెరిగాయి. దీని కారణంగా దిగ్గజ కంపెనీలైన టాటా మోటార్స్, మారుతీ సుజూకీ, మహీంద్ర మరి ఇతర కంపెనీలు మంచి లాభాలను ప్రకటించాయి.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

SBIN, BPCL, Bajaj Auto, Tata Motors, Engineers India, Godrej properties, M&M.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,650 గా, రెసిస్టెన్స్ లెవెల్ 35,900 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,550 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,880 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

ప్రపంచ మార్కెట్ల సూచీలు లాభాల్లో ట్రేడ్ అవ్వడం, కొవిడ్ వాక్సిన్ రెండో దశ ప్రారంభ మవ్వడం, ఇండియాన్ జీడీపి, వాహన విక్రయాలు ఆకర్షణీయంగా ఉండటం ఇవన్నీ అంశాలు మార్కెట్ కు సానుకూల అంశాలే కాబట్టి ఈ రోజు కూడా మన మార్కెట్లు మంచి లాభాల్లో పయనించే అవకాశం ఉంది. మార్కెట్ మూమెంట్ గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *