నిఫ్టీ జోరు కొనసాగుతుందా? లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు

అంతర్జాతీయంగా సానుకుల సంకేతాలు అందటంతో నిన్నటి ట్రేడింగ్ సెషన్లో మధ్యాహ్నాం నుంచి నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అయింది. అలాగే సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా లాభాల దిశగా దూసుకెళ్ళాయి. అమెరికాలో బాండ్ ఈల్డ్ద్స్ వెనుకబడటం, డోజోన్స్, నాస్ డాక్ ఫ్యూచర్స్ పుంజుకోవడంతో ఐటీ, బ్యాంకింగ్, ఆటో సెక్టార్ షేర్లు లాభ పడ్డాయి.

 

న్యూస్ స్టాక్స్:

అదానీ పోర్ట్స్: అదానీ పోర్ట్స్ రుణ నాణ్యతకు ఇబ్బంది లేదని ప్రముఖ రేటింగ్ దిగ్గజం మూడీస్ స్పష్టీకరణ చేసింది. ఇటీవల కాలంలో అదానీ పోర్ట్స్ వివిధ రుణ పద్ధతుల ద్వారా గంగవరం పోర్ట్ లో రూ.5,650 కోట్లతో 31.5 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసింది.

గోద్రేజ్ ప్రొపర్టీస్: సంస్థలోని అర్హత కలిగిన ఇన్వెస్టర్ల ద్వారా షేర్లు జారీ చేసి రూ.3,750 కోట్ల మూలధన సమీకరణకు  సిద్ధమైంది.

ఇండియాన్ బ్యాంక్: క్యూఐపి పద్ధతిలో షేర్ల అమ్మడం ద్వారా సుమారు రూ.4000 కోట్ల రూపాయలు సమీకరించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అంగీకరించనట్లు తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Indian Bank, SBI, L&T, JMC Project, Jubilant Foodworks, Reliance

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,500 గా, రెసిస్టెన్స్ లెవెల్ 37,200 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,920 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,250 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవ్వడం అలాగే అమెరికాలో బాండ్ ఈల్డ్స్ రాబడులు తగ్గడం వంటి సానుకూల అంశాలు మన మార్కెట్లను లాభాల దిశగా కొనసాగించే వీలుంది కాబట్టి మార్కెట్ మూమెంట్ ను గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *