‘బుల్’ హవా కొనసాగుతుందా? ప్రతికూలంగా గ్లోబల్ మార్కెట్లు

బుల్ మార్కెట్ హవా మూడో రోజు కూడా కొనసాగింది. విదేశీ మదుపర్లు ఏకంగా ఒకే రోజు రూ.28,739.17 కోట్ల రూపాయల పెట్టుబడులను ఇండియాన్ మార్కెట్ లోకి చొప్పించారు. పలు రేటింగ్ సంస్థలు ఇండియా ఎకనామీ పై 2021-2022 సంవత్సరానికి గాను 13.7శాతంగా వృద్ధి రేటు నమోదు ఉంటుందని ఆశలు రేకెత్తించాయి. అయితే ఇది ఇలా ఉండగా నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో గ్లోబల్ మార్కెట్లు నష్టలతో ముగిసాయి.

న్యూస్ లో ఉన్న స్టాక్స్:

భారతీ ఎయిర్టెల్ : వివిధ రుణ సాధనాలు అయినటువంటి బాండ్స్, డిబెంచర్స్ మరియు ఇతర పద్ధతుల ద్వారా సుమారు రూ.9375 కోట్ల రూపాయలను సమీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది.

మంచి లాభాలను ప్రకటించిన కె ఎస్ బి : డిసెంబర్ 2020 త్రైమాసిక ఫలితాల్లో రూ.32 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది.

రెయిన్ ఇండస్ట్రీస్ క్యూ4 ఫలితాలు అదుర్స్: ప్రముఖ కెమికల్స్ మానుఫాక్చరింగ్ కంపెనీ డిసెంబర్ 2020 త్రైమాసికంలో రూ.321 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు సంస్థ తెలిపింది.

కోల్ ఇండియా: రానున్న కాలంలో 26 రకాల ప్రాజెక్ట్స్ పై సుమారు రూ.1.43 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

BHEL, Coal India, Rain Industries, Axis Bank, Bharati Airtel, IOL Chemicals

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

సింగపూర్ నిఫ్టీ 14,914 వద్ద 109 పాయింట్లతో నష్టల్లో ట్రేడ్ అయింది కాబట్టి ఈ రోజు ఇండియాన్ మార్కెట్లు కన్సొలేడేషన్ లో ఉండే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,920 గా, రెసిస్టెన్స్ లెవెల్ 37,350 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,875 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,230 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు ప్రతికూలంగా మరియు ఈ రోజు నుంచి ఇండియాన్ మార్కెట్లో మార్చి సీరిస్ రోలోవర్ ఉంది కాబట్టి మార్కెట్ మూమెంట్ గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *