స్టాక్ మార్కెట్ లో అలజడి! బుల్ రేస్ లో మార్కెట్లు

ఎప్పుడూ జరగని రీతిలో మన ఇండియాన్ స్టాక్ మార్కెట్ స్తంభించిపోయింది. సుమారు నాలుగు గంటలపాటు ట్రేడింగ్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. రిటైల్ ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా మన మర్కెట్లతో కలిపి ప్రపంచ మార్కెట్లు సైతం లాభాలతో దూసుకుపోతున్నాయి.

న్యూస్ లో ఉన్న స్టాక్స్ :

ఐఓసి: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇథనాల్ ప్లాంట్స్ పై సుమారు 600 కోట్ల పెట్టుబడులను తెలుగు రాష్టాలలో పెడుతున్నట్లు సంస్థ వెల్లడించింది.

గ్రాన్యూల్స్ ఇండియా: అంతర్జాతీయ విపణీలో ‘మైగ్రేన్’ ఔషధానికి అనుమతి లభించినట్లు కంపెనీ తెలిపింది.

ఎయిర్ టెల్ : ప్రకటనల విభాగంలోకి ఎయిర్ టెల్ సరికొత్త నినాదంతో ’ఎయిర్ టెల్ యాడ్స్’ పేరుతో అడుగుపెట్టింది.

 

ఇంట్రాడేకి ఈ స్టాక్స్ పరిశీలించండి:

IOC, Tata Motors, M&M, Reliance, Cochin shipyard, Granules India, AXIS Bank, HDFC Bank, IndusInd Bank

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

సింగపూర్ నిఫ్టీ 15,079 వద్ద 30 పాయింట్లతో లాభాల్లో ట్రేడ్ అయింది కాబట్టి నిఫ్టీ గ్యాప్ ఆప్ అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 36,200 గా, రెసిస్టెన్స్ లెవెల్ 37,350 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,860 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15090 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు సానుకూలంగా ఉండటంతో ఈ రోజు కూడా మన మార్క్ ట్లు లాభాలతో పయనించే అవకాశం ఉంది అలాగే డిరెవేటిస్ ఎక్సపయిరీ ఉంది కాబట్టి మార్కెట్ మూమెంట్ గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

స్టాక్ మార్కెట్ లో అలజడి! బుల్ రేస్ లో మార్కెట్లు

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *