రికవరీ దిశగా మార్కెట్లు! అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలం.

గత ఐదు రోజులుగా నష్టాల్లో ట్రేడ్ అయిన మార్కెట్లు మళ్లీ రికవరీ బాట పడుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాలతో ముగిసాయి. కొన్ని అనిశ్చితలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్లతో ముందుకు సాగిపోవచ్చు.

న్యూస్ లో ఉన్న స్టాక్స్ :

రిలయన్స్ ఇండస్ట్రీస్: కంపెనీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మార్కెట్ లీడర్ అయిన రిలయన్స్ తమ సంస్థలో అత్యధిక లాభాలు ఇచ్చే చమురు రసాయనాల (ఆయిల్ టు కెమికల్స్‌-ఓటూసీ) విభాగాన్ని ప్రత్యేకంగా విడదీయనుంది. అలాగే రూ.1.8 లక్షల కోట్లతో దీన్ని విస్తరించనుంది. ఇలా ప్రత్యేకంగా ఆవిర్భవించడంతో ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ ప్లాంట్లు తయారీ యూనిట్లతో పాటు ఇంధన రిటైల్ మార్కెటింగ్ జేవీలో రిలయన్స్ కు 51శాతం వాటా బదిలీ కానుంది.

టాటా మోటార్స్ :  తమిళనాడు గవర్నమెంట్ నుంచి సుమారు 12,000 పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ తయారీకి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

అతి పెద్ద కాంట్రక్ట్ చేజిక్కించుకున్న కొచిన్ షిప్ యార్డ్ : సుమారు రూ.10,000 కోట్ల విలువ చేసే ఆర్డర్ ను ఇండియాన్ నేవీ నుంచి వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

మహీంద్ర అండ్ మహీంద్రతో జతకట్టిన అమెజాన్:  ఈ-కామెర్స్ దిగ్గజం అమెజాన్ సరుకు డెలవరీకి కావాల్సిన సుమారు 10,000 ఎలక్రిక్ వాహనాల తయారీకి రానున్న నాలుగు సంవత్సరాలకు మహీంద్రతో ఒప్పందం కుదుర్చుకుంది.

 

ఇంట్రాడేకి ఈ స్టాక్స్ పరిశీలించండి:

Tata Motors, M&M, Reliance, Aurobindo Pharma, NPTC, Tata Power, Tata Consumer, Ashok Leyland, Cochin shipyard, Bharat Forge.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

సింగపూర్ నిఫ్టీ 14,823 వద్ద 48 పాయింట్లతో లాభాల్లో ట్రేడ్ అయింది కాబట్టి నిఫ్టీ గ్యాప్ ఆప్ అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35000 గా, రెసిస్టెన్స్ లెవెల్ 36,100 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,675 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,890 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు సానుకూలంగా ఉండటంతో ఈ రోజు మన మార్క్ ట్లు లాభాలతో పయనించే అవకాశం ఉంది అలాగే ఈ నెల ఆఖరకు డిరెవేటిస్ ఎక్సపయిరీ ఉంది కాబట్టి మార్కెట్ మూమెంట్ గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *