ఉరకలేసిన బుల్… జోరు కొనసాగుతుందా?

నిన్నటి మార్కెట్ అందరీ అంచనాలను ప్రక్కకు నెట్టేసి.. అధ్యంతం అంకెల్ని మార్చుకుంటూ లాభాల్లో ట్రేడ్ అయింది. ఒకే రోజులో ఎవరూ ఊహించని విధంగా నిఫ్టీ 337 పాయింట్లు పెరిగి నష్టాల మార్కెట్లకు బ్రేక్ వేసింది. ఇన్వెస్టర్లు రానున్న ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉంటాయనే ధోరణితో పెట్టుబడులకు ఊతమిచ్చారు. అలాగే ఆర్థిక సంవత్సరం ముగియడంతో ముట్యూవల్ ఫండ్ మేనేజర్లు తమ వద్ద ఉన్న మిగులు నిధులను మార్కెట్లోకి చొప్పించడం, అమెరికాలో మౌలిక ప్యాకేజీ ఆమోదం కావడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం ఇలా కొన్ని జాతీయ, అంతర్జాతీయ అంశాలు మన మార్కెట్లను లాభాల్లోకి పయనించేలా చేశాయి. ఇది ఇలా వుంటే గ్లోబల్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరి ఈ రోజు కూడా ఈ బుల్ రేస్ కొనసాగుతుందా లేదా కాన్సాలిడేషన్లో కి వెళ్ళే అవకాశం ఉందో చూడాల్సివుంది.

న్యూస్ స్టాక్స్:

టాటాపవర్: గుజరాత్‌లో 60 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి గుజరాత్ ఉర్జా వికాస్ నిగం లిమిటెడ్ టాటా పవర్ కు  ఆర్డర్‌ లభించింది. ఈ ఒప్పందంతో టాటా పవర్ యొక్క ఇంధన సామర్థ్యం 4,007 మెగావాట్లకు పెరగనుంది.

ఎల్ అండ్ టి : ఎల్ అండ్ టి కి వివిధ వ్యాపార విభాగాలలో రూ.1,000-2,000 కోట్ల రూపాయల ఆర్డర్‌లు లభించాయి.

భెల్: ఒడిశాలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్) పారాడిప్ రిఫైనరీలో సల్ఫర్ రికవరీ యూనిట్ ఏర్పాటు కోసం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) 400 కోట్ల రూపాయల ఆర్డర్‌ను అందుకుంది.

దిలీప్ బిల్డ్‌కాన్ : కర్ణాటకలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ (డిబిఎల్) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి రూ .1,137 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందుకుంది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

L&T, BHEL, Tata Power, HDFC Bank, TCS, UPL

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 33,250 రెసిస్టెన్స్ లెవెల్ 34,400 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,750 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,050 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

అంతర్జాతీయ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ ను జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడే చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *