తీవ్ర ఒడుదుడుకులు…భారీ పతనం దిశగా మార్కెట్లు?

కరోనా భయందోళనలకు మార్కెట్లు కుదేలవుతున్నాయి. గత నాలుగు రోజులుగా మదుపరులకు నష్టాలే. నిన్నటి ట్రేడింగ్ సెషన్లో ఎప్పుడూ లేని విధంగా తీవ్రవైన ఒడుదుడుకులు మధ్య ట్రేడింగ్ కొనసాగింది. ట్రేడింగ్ సమయంలో ఆర్ బి ఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ బ్యాంకులపై చేసిన కీలక వ్యాఖ్యలకు ఒకానొక దశలో బ్యాంక్ నిఫ్టీలో 900 పాయింట్లు పెరిగి అదే విధంగా చివరిలో 286 పాయింట్ల నష్టాలతో మార్కెట్ ముగిసింది. అంతర్జాతీయంగా ఎటువంటి సానుకూల సంకేతాలు లేకపోవడం, కరోనా కేసులు పెరిగిపోవడంతో ఈ రోజు కూడా డౌన్ ట్రెండ్ కొనసాగే అవకాశం లేకపోలేదు.

 

న్యూస్ స్టాక్స్:

శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్: శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్  ఈ ఆర్థిక సంవత్సరంలో మరోసారి ఒక షేరుకు రూ.6 రూపాయల డివిడెంటు ని ప్రకటించింది. దీనికి ఏప్రిల్ 6ను రికార్డ్ డేట్ గా నిర్ణయింది.

వెల్స్ స్పన్ : ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ Welspun Enterprises  కు నేషనల్ హైవేస్ నుంచి సుమారు రూ.1900 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టు లభించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Ramco Systems, Welspun Enterprises, Shriram Transport Finance, Voltas

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,500, రెసిస్టెన్స్ లెవెల్ 33,900 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,120 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,420 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే మన మార్కెట్లకు హోలీ సందర్భంగా సోమవారం సెలవు వుండటంతో వరుసగా మూడు రోజులు గాప్ ఉంది కాబట్టి ఈ రోజు కూడా మన సూచీల్లో ఒడుదుడుకుల ఉండే అవకాశాలున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ ను జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడే చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *