బ్యాంకింగ్ షేర్ల మద్దతుతో నిఫ్టీ ముందుకు వెళ్తుతుందా? బలహీనంగా గ్లోబల్ సూచీలు

గత కొన్ని రోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న మార్కెట్లకు రుణ మారటోరియంను పొడిగించడానికి వీలుకాదని సుప్రీం కోర్టు తీర్పుతో బ్యాంకింగ్ షేర్లలో ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దీంతో బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ని కూడా లాభాల్లోకి నెట్టింది. అంతర్జాతీయంగా ఎటువంటి సానుకూల పరిణామాలు లేకపోవడంతో ఈ రోజు కూడా ఒడుదుడుకుల మధ్య నిఫ్టీ ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

న్యూస్ స్టాక్స్:

టాటా పవర్: నేపాల్ లో రూ.300 కోట్లు విలువ చేసే విద్యుత్ ట్రాన్స్ మిషన్ ప్రాజక్టును టాటా పవర్ కి లభించింది.

గ్లెన్ మార్క్: దిగ్గజ ఫార్మా కంపెనీ ఇంటర్నేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్ సి) రూ.290 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. కొవిడ్‌-19 క్రియాశీలకంగా ఎదుర్కొవడంలో చొరవచూపిన సంస్థలకు  ఐఎఫ్ సి ఈ రుణాలను మంజూరు చేస్తుంది.

సౌత్ ఇండియాన్ బ్యాంక్: క్యూఐపీ పద్ధతి ద్వారా రూ.240 కోట్ల మూలధనం సమీకరించేందుకు బ్యాంక్ వాటాదార్లు ఆమోదం తెలిపారు.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Adani Ports, Bharati Airtel, Glenmark, Tata Power, RailVikas, HDFC Bank, AXIS Bank, Rossari Biotech.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 33,400గా, రెసిస్టెన్స్ లెవెల్ 34,900 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,590 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,920 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ సూచీలు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే సింగపూర్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతుండటంతో ఈ రోజు మన సూచీల్లో ఒడుదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ ను జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడే చేయండి. ఆల్ ద బెస్ట్!

 

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *