ప్రతికూలంగా గ్లోబల్ సూచీలు… వాలటల్టీ దిశగా మార్కెట్లు?

రోజు రోజుకు పెరుగుపోతున్న కరోనా కేసులు, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, గ్లోబల్ సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవ్వడం వంటి వివిధ కారణాల వల్ల గతవారం మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఈ వారంలో కూడా దేశీయంగా ఎటువంటి సానుకూల పరిణామలు లేకపోవడం, కొవిడ్ కేసులు అధికమవ్వడం అలాగే మార్చి సిరీస్ డెరివేటివ్ ముగింపులో ఉంది కాబట్టి మార్కెట్లు ఒడిదుడుకుల మధ్యే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

న్యూస్ లో ఉన్న స్టాక్స్:

ఆరామ్కో : సౌదీ అరేబియా ప్రభుత్వ సంస్థ ఆరామ్కో 2020 సంవత్సరానికి గాను కంపెనీ నికర లాభాల్లో సగానిపైగా తగ్గి 4,900 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. దీని ప్రభావం రిలయన్స్ షేరు పై పడే అవకాశాలు ఉన్నాయి.

భారత్ ఢైనామిక్స్: ఇండియాన్ డిఫెన్స్ శాఖ నుంచి రూ.1,188 కోట్ల రూపాయల ఒప్పందాన్ని బిడిఎల్ సొంతం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియాన్ ఆర్మీకి మిసయిల్స్ ని సరఫరా చేయాల్సి వుంటుంది.

అదానీ గ్రీన్ : టోరెంటో బేసిడ్ కంపెనీ స్కైపవర్ గ్లోబల్ లో సౌర విద్యుత్ అవసరాల కోసం సుమారు రూ.317 కోట్ల రూపాయల విలువ చేసే కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Adani Greens, Bharati Airtel, Bharat Dynamics (BDL), GAIL, Tata Motors, HDFC Bank, Aarti Drugs.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,000 గా, రెసిస్టెన్స్ లెవెల్ 34,700 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,700 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,850 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *