కాన్సాలిడేషన్, వాలటల్టీ దిశగా మార్కెట్లు? సానుకూలంగా ట్రేడ్ అవుతున్న గ్లోబల్ సూచీలు

Proft Trader

గత మూడు రోజులుగా దేశీ, విదేశీ మదుపరుల అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఇండియాన్ మార్కట్ సూచీలు నష్టాలలో ట్రేడ్ అవుతున్నాయి. దీనికి తోడు బాండ్ మార్కెట్లో అనిశ్చిత, ద్రవ్యల్బణ గణాంకాలు, కోవిడ్ భయాలు మార్కెట్ ని ఒడిదుడుకుల మధ్య నడిపిస్తున్నాయి.

న్యూస్ స్టాక్స్:

గోద్రేజ్ ప్రాపర్టీస్: ప్రముఖ రియల్టీ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ క్విప్ జారీ ద్వారా రూ.3,750 కోట్లు సమీకించనట్లు తెలిపింది.  ఈ నిధులు కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు మరియు వ్యాపారాన్ని వేగంగా విస్తరించడానికి ఉపయోగపడతాయని కంపెనీ తెలిపింది.

టిసియస్ నూతన ఆవిష్కరణ: దిగ్గజ ఐటీ సంస్థ టిసియస్ సైబర్ నేరాలను, అవరోధాలను ఎదుర్కొనేందుకు కంపెనీలకు ఉపయోగకరంగా ఉండే ఆటోమేటెడ్ వల్నరబిలిటీ రెమీడియేషన్ ప్లాట్ ఫాం ను ఆవిష్కరించింది. దీని ద్వారా సాఫ్ట్ వేర్ బలహీనతలు గుర్తించి, వాటిని సరి చేయడం ద్వారా సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పిస్తుందని కంపెనీ తెలిపింది.

ఎల్ అండ్ టీ : దేశీయంగా వివిధ రంగాలలో తమకు రూ. 1,000 నుంచి 2,500 కోట్ల రూపాయల విలువగల భారీ ఆర్డర్లు లభించాయన ఎల్ అండ్ టీ వెల్లడించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

BEML, L&T, Godrej Properties, GMM Pfaudler, PEL

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,600 గా, రెసిస్టెన్స్ లెవెల్ 35,800 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,880 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,140 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్న కూడా మన మార్కెట్లు నెగెటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. అయితే క్యాబినెట్లో కేంద్రం డిఎఫ్ఐ (డెవలప్ మెంట్ ఫైనాన్స్ ఇన్ప్రస్టేక్చర్ ) బిల్లును అమోదించడం  వ ల్ల దీని ప్రభావం ఈ రోజు మార్కెట్లో పాజటివ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ ను గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *