సందిగ్ధతలు, భయాందోళనల్లో మార్కెట్లు? కీలకం కానున్న ఆర్థిక గణాంకాలు

గత వారంలో మార్కెట్లు భారీ లాభాల్లో నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. దీనికి ప్రధాన కారణం భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పారిశ్రామిక మరియు రిటైల్ ద్రవ్యోల్బణాల్లో క్షీణత, ధరల పెరుగుదల అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే మళ్లీ అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరగడం, కరోనా భయందోళనలు, అమెరికా ఫెడ్ రిజర్వు సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు, భారత్ ఆర్థిక గణాంకాల సూచీలు వీటన్నిటి మధ్య ఈ వారం మార్కెట్ల ఒడిదుడుకులు మధ్య నడిపించే అవకాశం ఉంది.

న్యూస్ స్టాక్స్:

బిగ్ బాస్కెట్ ను కొనుగోలు చేయనున్న టాటా: ఆన్ లైన్ గ్రోసరీ ప్లాట్ ఫామ్ బిగ్ బాస్కెట్ ను టాటా సంస్థ కొనుగోలు చేయనుంది. బిగ్ బాస్కెట్ లోని 64.3 శాతం వాటా కొనుగోలుకు ప్రతిపాదించినట్లు టాటాసన్స్ తెలిపింది.

ఎస్ బి ఐ కార్డ్స్: నాన్ కాన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వార సుమారు రూ.2,000 కోట్ల మూలధన నిధులు సేకరించడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు మీటింగ్ అంగీకరించినట్లు ఎస్ బి ఐ కార్డ్స్ మరియు పేమెంట్ సర్వీస్ సంస్థ తెలిపింది.

జిందాల్ స్టీల్ వార్షిక ఫలితాలు అదుర్స్: జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ 2021 ఫిబ్రవరి నాటికి 6.53 లక్షల టన్నుల స్టీల్ ని ఉత్పత్తి చేశామని, గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరంలో తమ అమ్మకాలు 18 శాతం పెరిగినట్లు నివేదించింది. గత సంవత్సరం ఫ్రిబ్రవరి 2020లో 5.54 లక్షల టన్నుల స్టీల్ ని ఉత్పత్తి చేసినట్లు సంస్థ తెలిపింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Tata Communication, Tata Motors, TCS, SBI Cards, Jindal Steel, Ramco Cements

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,000 గా, రెసిస్టెన్స్ లెవెల్ 36,850 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,920 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,120 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా, అంతర్జాతీయం ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఈ వారంలో వివిధ కంపెనీల ఐపివోలు మార్కెట్ ని పాజటివ్ గా ముందుకు తీసుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ ను గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

 

    1 Comment

  1. March 15, 2021
    Reply

    Thanks Bro….

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *