హై వోలటల్టీ దిశగా మార్కెట్లు? ఇండియా జీడీపీ అంచనాలు అదుర్స్

కరోనా కేసులు అధికమవడంతో మరల అన్ని చోట్ల లాక్ డౌన్ విధించవచ్చనే భయాలతో నిన్నటి ట్రేడింగ్ తీవ్ర ఒడుదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. ఈ రోజు ఆర్ బి ఐ ద్రవ్య పరిపతి విధానంపై ఎటువంటి నిర్ణయం వెలువడనుందనని ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. దీనికానుగుణంగా ఈ రోజు మార్కెట్లు డైరెక్షన్ వుంటుందని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా అమెరికా, చైనా మెరుగైన ఆర్ధిక గణాంకాలు వెల్లడించాయి. అలాగే 2021 సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి రేటు 12.5 శాతంగా వుంటుందని అంచనాలు వేయడంతో మార్కెట్లు పాజటివ్ గా మూవ్ అయ్యే అవకాశాలున్నాయి.

న్యూస్ స్టాక్స్:

జెఎస్‌పిఎల్: జిందాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్ (జెఎస్‌పిఎల్) 2020-21 ఆర్థిక సంవత్సరంలో 61% (YOY) అమ్మకాలు రికార్డు స్థాయిలో 7.86 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఈ సంస్థ ఉత్పత్తి తొలిసారిగా 20 లక్షల టన్నుల మార్కును దాటిందని స్టీల్‌మేకర్ తెలిపింది.

జి ఎం బ్రూవరీస్ క్యూ 4 ఫలితాలు: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో జి ఎం బ్రూవరీస్ లిమిటెడ్ నికర లాభం 155.29% పెరిగి రూ .45.34 కోట్లకు పెరిగినట్లు సంస్థ ప్రకటించింది. తమ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 17.18% పెరిగి 127.70 కోట్ల రూపాయలకు చేరుకుంది. మార్చి 2021 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జి ఎం బ్రూవరీస్ నికర లాభం 18.02% పెరిగి రూ .80.09 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .4 డివిడెండ్ ప్రతిపాదించింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

GM Breweries, Jindal Steel & Power, Axis Bank, Bharati Airtel, IEX

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,150 రెసిస్టెన్స్ లెవెల్ 33,000 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,500 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,900 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూలతలు ఉన్నప్పటికీ సూచీలు మిశ్రమంగానే ట్రేడ్ అవుతున్నాయి. అలాగే సింగపూర్ నిఫ్టీ కూడా నష్టాల్లోనే ఓపెన్ అయింది కాబట్టి  మార్కెట్ మూమెంట్ను జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడే చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *