కాన్సాలిడేషన్ దిశగా మార్కెట్లు? మిశ్రమంగా గ్లోబల్ సూచీలు

ఆర్థిక సంవత్సరం ముగింపులో మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. గత రెండు రోజులుగా అనూహ్యంగా పెరిగిన మార్కెట్ నిఫ్టీ గరిష్ఠ స్థాయుల వద్ద నిలబడలేక కాన్సాలిడేషన్ దిశగా వెళ్ళాయి. అదే విధంగా అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరగడం, టాక్స్ రేట్లలో మార్పులు ఉండొచ్చనే ఉద్ధేశంతో దేశీయ, అంతర్జాతీయ సూచీలు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

కల్పటారు పవర్ : కల్పటారు పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ (కెటిపిఎల్) దేశీయ, విదేశీ మార్కెట్లలో 625 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు తమకు లభించినట్లు కంపెనీ తెలిపింది.

ఐఆర్బి ఇన్ఫ్రా : ఐఆర్‌బి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ పశ్చిమ బెంగాల్‌లో రూ .2,421 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టును సొంతం చేసుకున్నారు.

పిరమల్ ఎంటర్ప్రైజెస్: పిరమల్ ఫార్మా హేమ్మో ఫార్మాలో 100% వాటాను 775 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయనుంది.

కేఎన్‌ఆర్ కన్స్ట్రక్షన్స్ : కేరళలో రహదారి ప్రాజెక్టు కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి కేఎన్‌ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్ (లోఏ) అందుకుంది. ఈ ప్రాజక్టు విలువ సుమారు 3 వేల కోట్లకు పైగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

KNR Constructions, PEL, IRB Infra, KalpaPower, M&M

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,500, రెసిస్టెన్స్ లెవెల్ 34,000 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,475 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,900 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి అలాగే శుక్రవారం గుడ్ ఫ్రేడే సందర్భంగా రేపు మార్కెట్లకు సెలవు కావడంతో మార్కెట్ మూమెంట్ ను జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడే చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *