సింగపూర్ నిఫ్టీ 15,035…రికార్డ్ హైలో మార్కెట్లు?

భారతీయ కంపెనీలతో పాటు అంతర్జాతీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు అదరగొడుతుండటంతో మార్కెట్లు లాభాల రేసులో చేలరేగిపోతున్నాయి. నిన్నటి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ 211 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 987 పాయింట్ల లాభాలతో ముగిసాయి. అలాగే ఈ రోజు సింగపూర్ నిఫ్టీ 15,035 వద్ద 131 పాయింట్ల లాభాల్లో ట్రేడ్ కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు బలంగా వుండటంతో ఈ రోజు కూడా మన మార్కెట్లలో బుల్ పరుగులు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే గ్లోబల్ గా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో కరోనా భయాలు నెమ్మదిగా మందగిస్తూ సానుకూల సంకేతాలు ఇస్తున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

AMBUJACEMAPTECHTATFL
BAJAJ-AUTOBAJAJHLDNGCOROMANDEL
DALBHARATEMBASSYEQUITASBNK
EXIDEINDLAURUSLABSL&TFH
HINDUNILVRINOXLEISURMAHABANK

న్యూస్ స్టాక్స్:

ఎస్ బి ఐ: దిగ్గజ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) డైరెక్టర్ల బోర్డు బాండ్ల ద్వారా 2 బిలియన్ డాలర్ల (8 14,895 కోట్లు) సేకరించడానికి ఆమోదం తెలిపింది. ఈ నిధులను విదేశాల్లో వ్యాపారాలు చేయడానికి బ్యాంక్ వినియోగించనుంది.

బజాజ్ ఫిన్‌సర్వ్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ నికర లాభంలో ఐదు రెట్లు పెరిగి 979 కోట్ల రూపాయలకు చేరుకుంది.

హాత్వే కేబుల్: హాత్వే కేబుల్ & డాటాకామ్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ .72.04 కోట్లకు 47.68% పెరిగింది.

టాటా కమ్యూనికేషన్స్: టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో 299.2 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

MOREPEN LABS, SBI, LAURUSLABS, COROMANDEL, EXIDEIND, ANUPAM RASAYAN.

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 33,116, రెసిస్టెన్స్ లెవెల్ 34,384 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,695 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,051 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అలాగే సింగపూర్ నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *