ఆర్ బీ ఐ విధానాలు ముందుకు తీసుకెళ్తాయా? గ్లోబల్ ఇండిసిస్ గ్రీన్!

కొవిడ్ తో కలవరపడుతున్న ప్రతిసారీ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ ను ముందుకు నడిపే ప్రయత్నమే చేస్తుంది. అలాగే నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో కొవిడ్ రిలీఫ్ కు సుమారు 50వేల కోట్ల రూపాయల రుణాలను వైద్య రంగానికి కేటాయించింది. దీంతో పాటు రూ.35,000 వేల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. ఆపత్కాలంలో మేమున్నాం అనే భరోసాను మదుపరులకు కల్పించింది.  ఈ విధానాలతో నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో ఫార్మా, బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీ కొనసాగింది. ఇక అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా ఫుల్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు విక్లీ ఎక్సపయిరీ వుండటంతో  మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య లాభాల్లో ముగిసే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Adani PowerAdani TransApcotex Ind
Deepak NitriteCaplin LabsCOFORGE LTD.
Hero MotocorpPraj IndustriesTATA Cons. Prod
Josts EngineersHindoostan MillFoseco India

న్యూస్ స్టాక్స్:

అదానీ ఎంటర్ప్రైజెస్: అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో రూ .233.95 కోట్లకు 282.2 శాతం వృద్ధిని సాధించింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ప్రతి షేరుకు 1 రూపాయల తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసింది.

టాటా స్టీల్: టాటా స్టీల్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో 79.7% క్వార్టర్-ఆన్-క్వార్టర్ (QoQ) నికర లాభం 6,644 కోట్లకు పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .25 డివిడెండ్‌ను ప్రకటించింది.

అలెంబిక్ ఫార్మా: ప్రముఖ ఫార్మా కంపెనీ అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ డోర్జోలామైడ్ హైడ్రోక్లోరైడ్ మరియు టిమోలోల్ మాలియేట్ ఆప్తాల్మిక్ మెడిసిన్ తయారీకి US ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డిఎ) నుండి తుది అనుమతి పొందింది.

సియాట్: ప్రముఖ టైర్ మ్యానుఫెక్చరింగ్ కంపెనీ సియాట్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో మూడు రెట్లు (195%) నికర లాభం రూ .153 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 45% పెరిగి 2,290 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా సియాట్ ఒక్కో షేరుకు రూ .18 తుది డివిడెండ్ ప్రకటించింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Tata Steel, CEAT, Adani Green, IDBI Bank, Tata Consumer Pro.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,268, రెసిస్టెన్స్ లెవెల్ 33,061 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,416 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,855 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా మరియు అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *