మార్కెట్ గాప్ డౌన్? కాన్సాలిడేషన్ దిశగా మార్కెట్లు…

దేశవ్యాప్త లాక్ డౌన్ భయాలతో నిన్నటి మార్కెట్ల ఒడుదొడుకుల మధ్య సూచీలు కదిలాడాయి. మార్కెట్ ముగింపులో లాభాల స్వీకరణతో సూచీలు మరింత దిగజారాయి. దేశవ్యాప్తంగా చాలా చోట్ల కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు కఠిన ఆంక్షలు విధించడంతో మార్కెట్లకు కరోనా భయాలు వెంటాడాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీనికి తోడు సాంకేతిక కారణాల వల్ల షాంఘై, టోక్యో మార్కెట్లు గత రెండు రోజులుగా పనిచేయట్లేదు. సింగపూర్ నిఫ్టీ సుమారు 190 పాయింట్ల పైగా కోల్పోయి నష్టాల్లో ట్రేడ్ అవుతుండటంతో ఈ రోజు కూడా మన మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల మధ్య నష్టాల్లో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

ABB Power ProduAdani EnterprisAdani Green
Deepak NitriteSRFTata Steel

 

న్యూస్ స్టాక్స్:

అదానీ పోర్ట్స్: అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఎపిఎస్ఇజెడ్) మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో 285% శాతం పెరిగి (YOY) నికర లాభం 1,288 కోట్లకు పెరిగింది. ఈ సందర్భంగా APSEZ బోర్డు ఒక్కో షేరుకు 5 రూపాయల డివిడెండ్ సిఫార్సు చేసింది.

ఆర్‌బిఎల్ బ్యాంక్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఆర్‌బిఎల్ బ్యాంక్ నికర లాభంలో 34% శాతం క్షీణించి 75 కోట్ల రూపాయలకు పడిపోయింది.

విప్రో: ఐటీ దిగ్గజం విప్రో లండన్‌లోని హోల్బోర్న్‌లో ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే నాలుగేళ్లలో సుమారు 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 16 మిలియన్ డాలర్లు (రూ.2142 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.

అలెంబిక్ ఫార్మా: అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో రూ .251 కోట్లకు 12% శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 14 రూపాయల డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Bajaj HealthCare, Wipro, Adani Green, HAL

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 31,900 , రెసిస్టెన్స్ లెవెల్ 32,800 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,273 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,723 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

కొవిడ్ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా ఎటువంటి సానుకూల సంకేతాలు లేవు అలాగే అంతర్జాతీయ సూచీలు సైతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *