సందిగ్ధతలో మార్కెట్లు! సానుకూలంగా గ్లోబల్ సూచీలు

అంతర్జాతీయ మార్కెట్లు డీలా పడటంతో నిన్నటి మార్కెట్ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అలాగే షాంఘై, టోక్యో మార్కెట్లు పనిచేయలేదు. రిలయన్స్ ఫలితాలు ఏ మాత్రం మార్కెట్ను ముందుకు తీసుకెళ్ళలేకపోయాయి. గ్లోబల్ సూచీలు మందకొడిగా వుండటంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. కొవిడ్ కారణంగా దేశీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్త లాక్డౌన్ కు తెరతీస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల నుంచి కోలుకొని స్వల్ప లాభాల్లో ముగిసినప్పటికీ దేశీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడంతో ఈ రోజు మన మార్కెట్లు స్తబ్ధుగా కదలాడే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

ADANIPORTSAlembic PharmaAPOLLOPIPES
Adani Total GasBhagiradh ChemLTI
GREAVESCOTMOREPENLABRBLBANK
SUVENP and GSrikalahasthi

 

న్యూస్ స్టాక్స్:

కోటక్ మహీంద్రా బ్యాంక్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం 33% పెరిగి రూ. 1,682 కోట్లకు చేరుకుంది. కోటక్ బ్యాంక్ మొత్తం డిపాజిట్లు క్యూ 4 లో 6.5% పెరిగి రూ .2.8 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

నాట్కో ఫార్మా: కొవిడ్ చికిత్సకు ఉపయోగించే బార్సిటినిబ్ టాబ్లెట్ల కొరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) నుండి నాట్కో ఫార్మాకు అత్యవసర వినియోగ అనుమతి లభించింది.

గోద్రేజ్ ప్రాపర్టీస్: గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ (జిపిఎల్) మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 4 ఎఫ్‌వై 21) రూ .191.62 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

ఎస్‌బిఐ లైఫ్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 532 కోట్ల రూపాయల నికర లాభాన్ని సంస్థ ఆర్జించింది.

వరుణ్ బేవరేజస్: వరుణ్ బేవరేజెస్ లిమిటెడ్ (విబిఎల్) మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 సివై 21) ఏకీకృత నికర లాభం రూ .136.76 కోట్లకు 127.7 శాతం పెరిగింది. ఈ సందర్భంగా VBL బోర్డు 1: 2 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. (అంటే షేర్ హోల్డర్ కలిగియున్న రెండు షేర్లకు ఒక షేరును అదనంగా కంపెనీ ఇవ్వనుంది)

టాటా కెమికల్స్: టాటా కెమికల్స్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 99.8% YOY (లేదా 93% QoQ) క్షీణించి 11.77 కోట్ల రూపాయలకు పడిపోయింది. అయితే సంస్థ ప్రాథమిక కెమిస్ట్రీ ఉత్పత్తుల విభాగం నుంచి 5.6% శాతం YOY వృద్ధిని నమోదు చేయగా, ప్రత్యేక రసాయనాల విభాగం నుంచి 38% శాతం YOY వృద్ధిని గడిచిన సంవత్సరంలో సాధించింది. ఈ సందర్భంగా టాటా కెమికల్స్ బోర్డు ఒక్కో షేరుకు రూ .10 డివిడెండ్ ప్రకటించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Motherson Sumi, Reliance, Natco Pharma, Kotak Mahindra Bank

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 31,900 , రెసిస్టెన్స్ లెవెల్ 32,560 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,484 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,855 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నప్పటికీ కొవిడ్ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా ఎటువంటి సానుకూల సంకేతాలు లేవు కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *