ఊగిసలాట దిశగా సూచీలు? నష్టాల్లో అమెరికా మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లు సోమవారం ఫ్లాట్ ప్రారంభమై, మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. సూయజ్ కాలువలో ‘ఎవర్ గివెన్’ నౌక చిక్కుకు పోవడంతో దాని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై కనిపించింది. ఈ రోజు మార్కెట్ పై అమెరికా ఆధారిత హెడ్జ్ ఫండ్ ఒకటి డిఫాల్ట్ కావడం, అలాగే కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతుండటం వంటి పరిణామాలు ఏ దిశగా దారితీస్తాయో వేచి చూడాలి. మార్చి నెల వాహన విక్రయాలు గణాంకాలు బలంగా నమోదైతే ఆటో మోబైల్ షేర్లలో కదలిక రావొచ్చు.

న్యూస్ స్టాక్స్:

అపోలో హాస్పటల్స్ : అపోలో హాస్పటల్స్ ఎంటర్ ప్రయిజ్ లో దీని అనుబంధ సంస్థలైన వెస్టర్న్ హాస్పటల్స్, అపోలో హోమ్ హెల్త్ కేర్ ఇండియా విలీనంగా కాబోతున్నాయి. దీనికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
హెచ్ పి సి ఎల్ : హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ షాపూర్జీ గ్రూపునకు చెందిన గుజరాత్ లోని ఎల్ ఎన్ జి టెర్మినల్ లో మెజార్టీ వాటాను రూ. 5,411 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
డాక్టర్ రెడ్డీస్: స్పూత్నిక్ వాక్సిన్ తయారీకి ఇండియాన్ డ్రగ్స్ రెగ్యులేటర్ నుంచి మరికొన్ని వారాల్లో ఆమోదం లభించనుంది. దీనికిగాను డాక్టర్ రెడ్డీస్ రష్యా డైరెక్ట్ ఇన్విస్ట్మెంట్ ఫండ్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Ramco Industries, Tata Motors, HPCL, Dr.Reddy, Biocon Pharma, Adani Transmission, HCL Tech, Adani Green

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,650 రెసిస్టెన్స్ లెవెల్ 34,020 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,300 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,730 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయంగా అమెరికా మార్కెట్లు మినహా మిగతావన్నీ మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి అలాగే ఈ వారంలో మనకు మూడు రోజులే మార్కెట్లు ట్రేడ్ అవుతాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ ను జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడే చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________
Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *