మళ్లీ కరోనా అలజడి…ఇంకా మార్కెట్లు పడనున్నాయా?

ఒక్కసారిగా అంతర్జాతీయ సూచీలు పడిపోవడం, అదే విధంగా అంతర్జాతీయంగా ఎటువంటి సానుకూల సంకేతాలు లేకపోవడంతో మన మార్కెట్లపై నిన్నటి ట్రేడింగ్ సెషన్లో మదుపరి తీవ్ర నష్టాలను చూడాల్సివచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటం మరి ముఖ్యంగా మన దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ అధికమవ్వడంతో ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురై అమ్మకాల వైపే మొగ్గు చూపారు. ఇదే ధోరణి కొనసాగితే రానున్న కొన్ని రోజుల్లో నిఫ్టీ 14000 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఈ రోజు కూడా మార్కెట్లు ఒడిదుడుకులు మధ్య కొనసాగే అవకాశం ఉంది.

 

న్యూస్ స్టాక్స్:

జూబ్లియెంట్ ఫుడ్ వర్క్స్: జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ఇంటర్నేషన్ రెస్టారెంట్ బ్రాండ్ అయిన PLK APAC pte Ltd. తో ప్రత్యేకమైన మాస్టర్ ఫ్రాంచైజ్ మరియు అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకుంది

ఐసిఐసిఐ బ్యాంక్: ఐసిఐసిఐ బ్యాంక్ ఇంటర్నేట్ బ్యాంకింగ్ ప్లాట్ ఫామ్ లో ఇన్స్టంట్ ఈఎంఐ సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రూ.5 లక్షల వరకు ఉన్న లావాదేవీలను సులభమైన నెలవారీ వాయిదాలుగా మార్చడానికి వీలు కల్పిస్తుంది. ఈ సదుపాయాన్ని అందించడానికి ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుదారు రేజర్ పే తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఎస్కర్ట్స్ ఇండియా: ఏప్రిల్ 1వ తేదీ నుంచి తమ అన్ని విభాగాల వాహన శ్రేణి ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Adani Ports, Adani Enterprises, ICICI Bank, Escorts India, Jubliant Foodworks, L&T, Prestige Estates, Zensar Technologies

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,500, రెసిస్టెన్స్ లెవెల్ 34,020 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,320 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,680 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ ఆసియా మార్కెట్లలో జపాన్ నికాయ్ మినహా మిగతావన్నీ చాలా మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు కూడా మన సూచీల్లో ఒడుదుడుకుల ఉండే అవకాశాలున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ ను జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడే చేయండి. ఆల్ ద బెస్ట్!

 

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *