లాభాల్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుందా? సానుకూలంగా గ్లోబల్ సూచీలు

గత కొన్ని రోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు దేశీయంగా ఎటువంటి సానుకూల పరిణామాలు లేకపోవడంతో పాటు అంతర్జాతీయంగా సానుకూలు సంకేతాలు లేకపోవడంతో నిన్నటి ట్రేడింగ్ షెషన్లో కూడా నష్టాల్లోనే ముగిసాయి. అయితే చివరిలో ఐటీ, ఎఫ్ఎంజిసీ రంగాలలో షేర్ల కొనుగోళ్ళుతో స్వల్ప నష్టాలతో నిఫ్టీ ముగిసింది.

న్యూస్ స్టాక్స్:

బిపిసియల్ : తమ అనుబంధ సంస్థ అయినటువంటి భారత్ గ్యాస్ ను విలీనం చేసుకునేందుకు బిపిసియల్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

డిమార్ట్: ప్రముఖ గొలుసు వర్తక హైపర్ మార్కెట్ సంస్థ అవెన్యూ సూపర్ మార్కెట్స్  ముంబయిలోని చెంబర్ సబర్స్ లో 39000 చ.అ. రెండు అంతస్తుల భవనాన్ని 113 కోట్లకు కొనుగోలు చేసింది.

రెయిల్టెల్ కార్పొరేషన్: ఇండియా సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ సంస్థ నుంచి రూ.153 కోట్ల రూపాయల విలువైన బ్రాడ్ బాండ్ సర్వసు ఆర్డరు తమకు లభించినట్లు రెయిల్ టెల్ తెలిపింది.

కెఎన్ఆర్ కన్ స్ట్రక్షన్: కర్ణాటక గవర్నమెంట్ నుంచి రూ.1,100 కోట్ల రూపాయల విలువ చేసే రోడ్డు నిర్మాణ ప్రాజక్టు తమకు లభించినట్లు సంస్థ తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Adani Greens, KNR Constructions, RailTel, BPCL, Piramal Enterprises Ltd (PEL). MindTree.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 33,200 గా, రెసిస్టెన్స్ లెవెల్ 34,450 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,580 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,850 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గ్లోబల్ సూచీలు సానుకూలంగా ఉండటంతో సింగపూర్ నిఫ్టీ 14,803 వద్ద లాభాల్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మార్కెట్ మూమెంట్ ను జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడే చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

    1 Comment

  1. Good

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *