నిఫ్టీ గ్యాప్ అప్? లాభాల్లో గ్లోబల్ సూచీలు

రెండోదశ కరోనా కేసుల విజృంభణ స్టాక్ మార్కెట్ ని కుదిపేసింది. దీంతో ప్రారంభంలో స్వల్ప లాభాలతో ట్రేడ్ అయిన మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల మధ్య ట్రేడ్ అవుతూ ముగింపు దశలో మార్కెట్లో అమ్మకాలు పోటెత్తడంతో భారీ నష్టాల్లో నిఫ్టీ 189 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 575 పాయింట్లు కోల్పోయాయి. అలాగే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధాన ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఇదిలా ఉంటే సింగపూర్ నిఫ్టీ సుమారు 200 పాయింట్లతో లాభాల్లో ట్రేడ్ అవుతూ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం గమనార్హం.

 

న్యూస్ స్టాక్స్:

ఎయిర్‌టెల్‌: ప్రముఖ టెలికాం పోటీదారు భారతీ ఎయిర్‌టెల్‌కు సుమారు మరో 58.90 లక్షల కనెక్షన్లు జతచేరి, మొత్తం వినియోగదార్ల సంఖ్య 34.46 కోట్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది.

హెచ్ఎఫ్ సి ఎల్: ఆప్టికల్ ఫైబలర్ కేబుల్ ఉత్పత్తి సంస్థ హెచ్ఎఫ్ సి ఎల్ కు రూ.221.16 కోట్ల రూపాయల విలువగల కంట్రాక్టు ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి తమకు లభించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

బిహెచ్ఇఎల్ : న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన అణు ఇంధన విద్యుత్ ప్రాజెక్టులకు  సంబంధించి సుమారు రూ.10,800 కోట్ల రూపాయల విలువగల కంట్రాక్టు లభించిందని సంస్థ తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

BHEL, Bharati Airtel, HFCL, L&T, DLF, ABB Power

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 33,3800 గా, రెసిస్టెన్స్ లెవెల్ 36,420 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,550 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,880 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ గమనం ఎటువైపు…

అంతర్జాతీయంగా యూరోపియన్ మార్కెట్లు మినహా మిగతావన్నీ సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా రెండోదశ గూర్చి ప్రధాన మంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు చేయడం, కొన్ని స్టేట్స్ లో మళ్లీ లాక్డౌన్ దిశగా వెళ్తుండటంతో దీని ప్రభావం ఇండియాన్ మార్క్ ట్ పై ఉందని చెప్పవచ్చు. అలాగే అమెరికా ఫెడ్ రిజర్వు సమావేశం ఉండటంతో దేశీ, విదేశీ మదుపరులు అప్రమత్తతో ఉంటున్నారు. ఇదిలా ఉంటే సింగపూర్ నిఫ్టీ సుమారు 200 పాయింట్లతో గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం గమనార్హం.  కాబట్టి మార్కెట్ మూమెంట్ ను గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *