నిఫ్టీ గ్రీన్ లో ట్రేడ్ అవుతుందా? సానుకూలంగా అంతర్జాతీయ మార్కెట్లు

నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ ని ద్రవ్యోల్బణ గణాంకాలు నష్టాల్లోకి లాగేశాయ్. దీంతో పాటు అంతర్జాతీయ ప్రతికూలతలు, కరోన భయాందోళనలు తోడయ్యాయి. విదేశీ, దేశీ మదుపరులు అమ్మకాలు వైపు మొగ్గు చూపారు. ఏది ఏమైనప్పటికీ స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు నష్టాల్లో నుంచి చివరిలో మళ్లీ లాభాల బాట పడ్డాయి.

న్యూస్ స్టాక్స్:

పి ఎన్ సి:  మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ కంపెనీ ప్రీతిష్ నంది కమ్యూనికేషన్ లో రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు.

అదానీ పోర్ట్స్: శ్రీలంకలోని కొలంబో పోర్ట్ లోని వెస్ట్ కంటైనర్ ను అభివృద్ధి చేసేందుకు శ్రీలంకన్ పోర్ట్ అథారిటితో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.

నాట్కో ఫార్మా: ప్రముఖ ఫార్మా సంస్థ నాట్కో పత్తి పొలాల్లో గులాబి రంగు పురుగులను నివారించేందుకు గాను ఒక నూతన ఆవిష్కరణ చేసింది. ఈ ఉత్పత్తిని ‘నాట్ మేట్ పిబీడబ్య్లూ‘ అనే బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Adani Ports, Tech Mahindra, ITC, Shree Cements, MTAR technologies

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,600 గా, రెసిస్టెన్స్ లెవెల్ 36,350 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,800 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,150 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ నాస్ డాక్ ఫ్యూచర్స్ పాజటివ్ గా ట్రేడ్ అవ్వడం మన మార్కెట్లను ముందుకు తీసుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా దేశీ, విదేశీ మదుపరులు పూర్తిగా సెల్లింగ్ సైడ్ ఉంటున్నారు కాబట్టి మార్కెట్ మూమెంట్ ను గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *