కన్సాలిడేషన్ లో మార్కెట్లు? అంతర్జాతీయంగా ముడి చమురు మంటలు

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగటం, సౌదీ రిఫైనరీలో డ్రోన్ కలకలం వంటి గాలి వార్తలు కారణంగా నిన్నటి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ తీవ్ర ఒడుదుడుకులు మధ్య ట్రేడ్ అయింది. అలాగే అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉండటంతో విదేశీ మదుపరులు అమ్మకాలు చేపట్టడం దీనికి తోడు నిన్నటి ట్రేడింగ్ సెషన్లో చైనా మార్కెట్లు సుమారు 3 శాతం పైగా నష్టపోయాయి.

న్యూస్ స్టాక్స్:

కోల్ ఇండియా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 32 బొగ్గు గనుల ప్రాజెక్టుల పై దాదాపు రూ.47,300 కోట్ల మేర పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ డైరెక్టర్ల బోర్టు తెలిపింది.

టాటా మోటార్స్: దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహన విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది. ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ విలువను రూ.9,417 కోట్లగా విలువ కట్టింది. ఈ విభజన ద్వారా దీర్ఘకాలంలో అధిక లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

అటుల్ ఆటో: ఆత్యాధునిక సదుపాయాలతో సిఎన్జీ, ఎల్పిజీ, పెట్రోల్ ఆటోలను గుజరాత్ మార్కెట్లోకి విడుదల చేసింది. త్వరలోనే దేశీ మరియు విదేశీ మార్కెట్లలో సరఫరా చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Tata Motors, HDFC Bank, Coal India, Natco Pharma, Autul Auto, AdaniGreen, ONGC

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,500 గా, రెసిస్టెన్స్ లెవెల్ 36,600 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,850 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,300 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

 

 

అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ అమెరికాలో 1.9 ట్రిలియన్ డాలర్ల ట్రెజరీ బిల్ ఆమోదం పొందటం ఈ రోజు మార్కెట్లకు ఒక పాజటివ్ న్యూస్ అవ్వొచ్చు కాబట్టి మార్కెట్ మూమెంట్ ను గమనిస్తూ ట్రేడే చేసుకోండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *