మార్కెట్ గ్యాప్ డౌన్? బలహీనంగా గ్లోబల్ సూచీలు

గత నాలుగు రోజులుగా లాభాల్లో పయనించిన మార్కెట్లు నిన్నటి ట్రేడింగ్ సెషన్లో  నిఫ్టీ గరిష్ఠ స్థాయిల వద్ధ లాభాల స్వీకరణ చేపట్టాయి. డీఐఐలు సుమారు 942 కోట్ల విక్రయాలు చేశారు. దీంతో ఒక్కసారిగా మార్కెట్లో సడన్ ఫల్ కనిపించింది. అంతర్జాతీయ సూచీలు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క అమెరికా మార్కెట్లు మినహా మిగతావన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో సింగపూర్ నిఫ్టీ సుమారు 184 పాయింట్లు కోల్పోయి 14,741 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ రోజు మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Ajanta PharmaAtulIndusInd Bank
RelianceShriram CityYes Bank
TCI DevelopersMaricoMahindra EPC
Indian AcrylicsIndian HotelsProgrex Venture

 

న్యూస్ స్టాక్స్:

హిందూస్థాన్ యూనిలీవర్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) నికర లాభం 41 శాతం పెరిగి రూ. 2,143 కోట్లకు చేరింది. Q4 లో HUL యొక్క వాల్యూమ్ వృద్ధి 16% శాతం పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .17 తుది డివిడెండ్‌ను ప్రతిపాదించింది.

బజాజ్ ఆటో: నికర లాభం 2% పెరిగి 1,332 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 140 రూపాయల తుది డివిడెండ్ ప్రకటించింది.

ఐనాక్స్ లీజర్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ రూ .93.69 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

లారస్ ల్యాబ్స్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ నికర లాభం 170% పెరిగి ఆదాయం రూ.297 కోట్ల రూపాయలకు చేరుకుంది.

అంబుజా సిమెంట్స్: మార్చిలో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 సివై 21) నికర లాభం 66.6 శాతం పెరిగి రూ .665 కోట్లకు పెరిగింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Ambuja Cements, Marico, Tata Consumers, Titan, Exide Industries.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 33,250, రెసిస్టెన్స్ లెవెల్ 34,232 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,694 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,051 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ సూచీలు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *