మెప్పిస్తున్న కంపెనీల ఫలితాలు…నిఫ్టీ 15,000 మార్కు దాటుతుందా?

దిగ్గజ కంపెనీల క్యూ4 ఫలితాలు బుధవారం వెలువడంతో నిన్నటి మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. దీనితో బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ లలో లాభాల ర్యాలీ కనిపించింది. బజాజ్ ఫైనాన్స్, యాక్సస్ బ్యాంక్ ఫలితాలు ఆశించిన దానికన్నా మెరుగ్గా వుండటంతో బ్యాంక్ నిఫ్టీ పరుగులు తీసింది. అలాగే టివిఎస్, ఎబిబి, హిందూస్తాన్ జింక్ మరికొన్ని కంపెనీల ఫలితాలు డబుల్ గ్రోత్ ను చూపించడంతో అటు బ్యాంకింగ్ షేర్లతో పాటు, ఫైనాన్స్ , మెటల్ షేర్లు కూడా మెరిశాయ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి కొనుగోళ్ళ మద్దతు ఎక్కువగా వుండటంతో మార్కెట్ ఆద్యంతం లాభాల్లోనే ట్రేడ్ అయ్యింది. దీనికి తోడు అంతర్జాతీయ సంకేతాలు బలంగా వుండటంతో మార్కెట్లకు కలిసొచ్చింది. ఇదే ధోరణి ఈ రోజు కూడా మార్కెట్లో కొనసాగే అవకాశం వుంది.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

BajajFINSVBIOCONTATACOMM
BOMDYEINGCARBORUNIVCHENNPETRO
HATHWAYKPITTECHKPRMILL
KSBNELCOGHCL

 

న్యూస్ స్టాక్స్:

మారుతి సుజుకి: దిగ్గజ ఆటో మోబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం సంవత్సరానికి 9.7% క్షీణించి 1,166 కోట్లకు చేరుకుంది. మార్చి 31, 2021 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 6.7% తగ్గి 14.57 లక్షల యూనిట్లగా నమోదయ్యాయి. అలాగే మారుతి సుజుకి బోర్డు ఒక్కో షేరుకు రూ .45 తుది డివిడెండ్ ప్రకటించింది.

యాక్సిస్ బ్యాంక్: దిగ్గజ ప్రయివేటు బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. మార్చిలో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ .2,677 కోట్లు సాధించినట్లు బ్యాంక్ తెలిపింది.

బజాజ్ ఫైనాన్స్: నికర లాభం 42% పెరిగి 1,347 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 10 రూపాయల డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

బ్రిటానియా ఇండస్ట్రీస్: బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 3% క్షీణించి రూ .360.1 కోట్లకు పడిపోయింది.

ఎబిబి ఇండియా: ఎబిబి ఇండియా లిమిటెడ్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 సివై 21) ఏకీకృత నికర లాభం రూ .151 కోట్లకు 118.64 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో మోషన్ ప్రొడక్ట్స్, రోబోటిక్స్ మరియు ప్రాసెస్ ఆటోమేషన్ విభాగాలలో ఎబిబి ఇండియా మెరుగైన వృద్ధిని సాధించింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Dr.Reddy’s, BharatiAirtel, BIOCON, Hatsun Agro, HINDZINC

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,330, రెసిస్టెన్స్ లెవెల్ 33,219 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14273 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14697 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ సూచీలు మిశ్రమ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *