రికార్డ్ హై లో అమెరికా మార్కెట్లు… బుల్ జోరు కొనసాగుతుందా?

ఒక వైపు కరోనా వణికిస్తున్న… భయాలను వీడనాడి మార్కెట్లు లాభాల్లో ముందుకు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సంకేతాలు బలంగా వుండటంతో మన మార్కెట్లకు కలిసొచ్చింది. అదే విధంగా అమెరికాలో దిగ్గజ ఐటీ కంపెనీలు టెస్లా, గుగూల్ అల్ఫాబెట్, ఆపిల్ మరియు ఇతర ఐటీ సంస్థల త్రైమాసిక ఫలితాలు ఈ వారంలో వెలువడనుండటంతో లాభాల పరంపర కొనసాగుతుంది. అలాగే సోమవారం టెక్ మహీంద్ర మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో టెక్ స్టాక్స్ నిఫ్టీని మరింత ముందుకు నడిపించే అవకాశం వుంది. ఇదే ఊపుతో ఈ రోజు మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Gateway Distri

Vesuvius India

VST

Tata Inv Corp

PNB Housing Fin

Symphony

IEX

Hatsun Agro

Sanofi India

 

న్యూస్ స్టాక్స్:

టెక్ మహీంద్రా: దిగ్గజ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో 17.4% క్వార్టర్-ఆన్-క్వార్టర్ నికర లాభం 1,081 కోట్లకు పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .30 తుది డివిడెండ్‌ను ఆమోదించింది.

హెచ్‌డిఎఫ్‌సి లైఫ్: హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ .317.94 కోట్లతో 2% పెరిగింది. ఈ త్రైమాసికంలో హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ సుమారు 9.8 లక్షల కొత్త వ్యక్తిగత పాలసీలను విక్రయించింది, ఇది 10% (YOY) వృద్ధిని నమోదు చేసింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 2.02 తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

ఎస్‌బిఐ కార్డు: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 110 శాతం పెరిగి రూ .175 కోట్లకు పెరిగినట్లు సంస్థ తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

HDFC Life, Reliance, SBI Cards, NATCO Pharma, Castrol India.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,100, రెసిస్టెన్స్ లెవెల్ 32,540 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,270 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,700 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

అంతర్జాతీయ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అలాగే సింగపూర్ నిఫ్టీ కూడా స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *