లాభాల్లో సింగపూర్ నిఫ్టీ… బుల్లిష్ మండే అవుతుందా?

కరోనా కేసులు ప్రళయంలా విరుచుకుపడుతున్న తరుణంలో భారత్ లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు దిగజారడంతో ఆర్థిక అనిశ్చితి నెలకొంది. అలాగే లాక్ డౌన్ లు మొదలవుతున్నాయి. ఇదిలా వుంటే అంతర్జాతీయ సంకేతాలు బలంగా వుండటంతో సింగపూర్ నిఫ్టీ సుమారు 200 పాయింట్ల వద్ద లాభాల్లో ట్రేడ్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఫలితాలు ఆశించిన దానికన్నా మెరుగ్గా వుండటంతో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ కొనసాగే అవకాశాలున్నాయి. అదే విధంగా విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు రూ.7,622 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లను విక్రయించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్యా ఇన్వెస్టర్లు నిఫ్టీ గరిష్ఠ స్థాయిల వద్ద లాభాల స్వీకరించే అవకాశం వుంది.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

TataTeleservice

Delta Corp

Alok Industries

Castrol

Schaeffler Ind

SBI Card

Tech Mahindra

HDFC Life

 

న్యూస్ స్టాక్స్:

ఐసిఐసిఐ బ్యాంక్: దిగ్గజ ప్రయివేటు బ్యాంక్ ఐసిఐసిఐ ఆకర్షణీయమైన ఫలితాలను మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంగాను వెల్లడించింది. ఐసిఐసిఐ బ్యాంక్ నికర లాభం 260% పెరిగి ఆదాయం రూ .4,402.6 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా బ్యాంక్ బోర్డు ఒక్కో షేరుకు రూ .2 చొప్పున తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

టాటా కన్స్యూమర్స్ : టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఒడిశాలోని గోపాల్‌పూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లోని 100 కోట్ల రూపాయల విలువ చేసే టీ ప్యాకేజింగ్ యూనిట్ ను త్వరలో ప్రారంభించనుంది. ఈ యూనిట్లో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 60 మిలియన్ కిలోలుగా వుంటుందని కంపెనీ తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

TATA Steel, Tata Consumers, ICICI Bank, SUN TV.

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 30,960, రెసిస్టెన్స్ లెవెల్ 32,120 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14150 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,526 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

కరోనా పరిస్థితులు వణికిస్తున్నా…అంతర్జాతీయ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *