లాభాల్లో మార్కెట్లు… బుల్ జోరు కొనసాగుతుందా?

కరోనా భయాలను మార్కెట్లు పట్టించుకోకుండా నిన్నటి ట్రేడింగ్ సెషన్లో తక్కువ స్థాయిల వద్ధ కొనుగోళ్ళు చేయడంతో అనుహ్యంగా మార్కెట్లు పెరిగాయి. బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ సెక్టార్ బలంగా ఉండటంతో బ్యాంకింగ్ నిఫ్టీ ఆరంభంలో 300పైగా పడిపోయినప్పటికీ సుమారు 669 పాయింట్లు పెరింగింది. అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవ్వడంతో నిన్నటి మార్కెట్లకు కలిసొచ్చింది. దేశీయంగా వాక్సిన్ ప్రకియ వేగవంతం చేయడం అలాగే మే నెల నుంచి ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేసే దిశగా చర్యలు చేపట్టడంతో మార్కెట్లు పాజటివ్ ముందుకు వెళ్ళే అవకాశం వుంది.

న్యూస్ స్టాక్స్:

ఎల్ అండ్ టి: లార్సెన్ & టౌబ్రో లిమిటెడ్ (ఎల్ అండ్ టి) సంస్థకు ఆయిల్‌ఫీల్డ్స్ సరఫరా సంస్థ సౌదీ నుండి సుమారు 2,500 కోట్ల రూపాయల విలువ చేసే ఆర్డర్ లభించింది.

ఇండస్ టవర్స్: ఇండస్ టవర్స్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 38% సంవత్సరానికి (YOY) రూ .1,364 కోట్లకు పెరిగింది.

విసాకా ఇండస్ట్రీస్ : విసాకా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 350.66% పెరిగి రూ.30.87 కోట్లకు పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 10 రూపాయల డివిడెండ్‌ను సిఫార్సు చేసింది.

టాటా ఎల్క్సీ: టాటా ఎల్క్సి లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 40.3% పెరిగి రూ .115.16 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు తుది డివిడెండ్ రూ .24 మరియు ప్రత్యేక డివిడెండ్ రూ .24 ఒక్కో షేరుకు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

HDFC BANK, L&T, Indus Towers, Visaka Industries.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్:

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 30,960, రెసిస్టెన్స్ లెవెల్ 32,230 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14150 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,526 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కరోనా భయాలు ఉన్నప్పటికీ మార్కెట్లు పాజటివ్ గా మూవ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *