14,200 దిగువకు SGX NIFTY… భారీ పతనం తప్పదా?

కరోనా భయాలతో మార్కెట్లో అమ్మకాల జోరు కొనసాగుతోంది. మంగళవారం ట్రేడింగ్ సెషన్ లో ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఇంకా మార్కెట్లను కరోనా భయాలను వీడటం లేదు అలాగే లాక్ డౌన్ విధింపుతో ఆందోళనలు మరింత ఎక్కువైయ్యాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లు సైతం మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇదిలావుంటే సింగపూర్ నిఫ్టీ సుమారు 325 పాయింట్లు కోల్పోయి 14,130 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ రోజు మార్కెట్ల పై వీటి ప్రభావంతో తీవ్ర ఒడుదొడుకుల మధ్య నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అయ్యే అవకాశం వుంది.

 

న్యూస్ స్టాక్స్:

ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఫలితాలు: ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రెండు రెట్లు పెరిగి 329 కోట్లకు పెరిగింది. ఈ సందర్భంగా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఒక్కో షేరుకు రూ .13.5 తుది డివిడెండ్ ను కంపెనీ వాటాదారులకు ప్రకటించింది.

కెఇసి ఇంటర్నేషనల్ : కెఇసి ఇంటర్నేషనల్ లిమిటెడ్ వివిధ వ్యాపార విభాగాలలో రూ .1,245 కోట్ల విలువైన కొత్త ఆర్డర్‌లను దక్కించుకుంది.

ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ : ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 75.55% పెరుగుదలతో రూ .127.73 కోట్లకు చేరుకుంది. కోల్‌కతాకు చెందిన ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ భారతదేశంలో అతిపెద్ద కార్బన్ బ్లాక్ ను ఉత్పత్తి చేసే సంస్థ. దీన్ని ప్రింటింగ్ మరియు ఎలక్ట్రిక్ వైర్లకు పూతగా ఉపయోగిస్తారు.

నెస్లే ఇండియా: మార్చి (క్యూ 1) తో ముగిసిన త్రైమాసికంలో నెస్లే ఇండియా సంవత్సరానికి 14.6% (YOY) నికర లాభం రూ .602 కోట్లకు పెరిగింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

KEC International, Cadila Healthcare Ltd, Tejas Network

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 30,750, రెసిస్టెన్స్ లెవెల్ 31,600గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 13,660 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,526 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కరోనా భయాలతో దేశీయ, అంతర్జాతీయ తీవ్ర ఒడుదొడుకుల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. అలాగే ఈ రోజు గురువారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాంట్రాక్ట్స్ ఎక్పయిరీ అవుతాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *