కొవిడ్ విజృంభణ… పతనం దిశగా మార్కెట్లు?

కరోనా మార్కెట్లను బెంబేలెత్తిస్తుంది. కొవిడ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోవడంతో పాటు మరణాల రేటు పెరిగిపోవడంతో సూచీలు భారీగా నష్టపోతున్నాయి. భారత్ లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాపిస్తుందని వార్తలు రావడంతో అంతర్జాతీ సమాజం భారత్ ని రెడ్ లిస్ట్ లో పెట్టడంతో పాటు భారత్ పై కఠిన అంక్షలు మొదలుపెట్టాయి. అలాగే కొన్ని చోట్ల లాక్ డౌన్ లు ప్రారంభమయ్యాయి. టీకాలు అందరికీ అందుబాటులో లేకపోవడం, అంతర్జాతీయంగా సానుకూల అంశాలు లేకపోవడం ఈ రోజు కూడా మార్కెట్లు తీవ్ర హెచ్చు తగ్గుల మధ్య ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి.

న్యూస్ స్టాక్స్:

ఎసిసి ఫలితాలు: మార్చి (క్యూ 1 సివై 21) తో ముగిసిన త్రైమాసికంలో తమ సంస్థ నికర లాభం 74.17% శాతంతో  సంస్థ లాభం రూ.562.69 కోట్ల పెరిగిందని కంపెనీ వెల్లడిందించి. సిమెంట్ అమ్మకాల సామర్థ్యం 21.5% శాతం పెరిగి 7.97 మిలియన్ టన్నులకు ఉత్పత్తి చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. అదే విధంగా జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలోని సింద్రీ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లో సంవత్సరానికి 1.4 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన కొత్త గ్రౌండింగ్ యూనిట్‌ను ఎసిసి ప్రారంభించింది.

బజాజ్ కన్స్యూమర్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి 54.67 కోట్ల రూపాయలకు చేరుకుంది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

IEX, ACC, IOC, Jubilant pharma, HDFC Bank.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 30,400, రెసిస్టెన్స్ లెవెల్ 31,680గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,191 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,697 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

కొవిడ్ పరిణామల కారణంగా దేశీయంగా, అంతర్జాతీయంగా సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. రేపు శ్రీనామ నవమి సందర్భంగా మార్కెట్లకు సెలవు కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *