నిఫ్టీ గాప్ డౌన్? బ్యాంకింగ్ షేర్లు నిఫ్టీని మందుకు తీసుకెళ్తాయా?

గతవారం మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల మధ్య నిరాశగా ట్రేడ్ అవుతూ నష్టాల్లో ముగిసాయి. దీనికి ప్రధాన కారణంగా కొవిడ్ విజృంభణ అనే చెప్పవచ్చు. రోజురోజుకీ శ్రుతి మించుతున్న కేసుల లెక్కలతో మదుపరుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. అదే విధంగా మార్కెట్లో హైయ్యార్ లెవల్స్లో లాభాలు స్వీకరణ జరగడంతో తీవ్ర ఒడుదుడుకుల మధ్య మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. ఈ వారం కూడా ఇలానే ఉండే అవకాశాలు లేకపోలేదు. అలాగే కొవిడ్ పరిణామల కారణంగా వివిధ రేటింగ్ సంస్థలు ఇండియా జీడీపీ అంచనాల రేటింగ్ ను తగ్గించారు.  శనివారం ప్రకటించిన హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ క్యూ4 ఫలితాలు బాగుండటంతో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అయ్యే అవకాశం వుంది.

న్యూస్ స్టాక్స్:

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ : ప్రముఖ ప్రయివేట్ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి మార్చిలో ముగిసిన త్రైమాసిక సంవత్సరానికి గాను శనివారం ఫలితాలు వెల్లడించింది. నికర లాభం 18.2 శాతం పెరిగి రూ .8,186.5 కోట్లకు చేరుకుంది. అలాగే మొత్తం డిపాజిట్లు 16.3% పెరిగి 13.35 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు బ్యాంక్ తెలిపింది.

ఐసిఐసిఐ లోంబార్డ్: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నికర లాభం 22.6% పెరిగి రూ .345.68 కోట్లకు చేరుకుంది.

అదానీ గ్రీన్ ఎనర్జీ: గుజరాత్‌లో 15 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది.

మైండ్‌ట్రీ : ప్రముఖ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ లిమిటెడ్ మార్చి నికర లాభం 53.4% ​​(రూ. 317.3 కోట్లకు) 317.3 కోట్లకు చేరుకుంది.

 

ఈ వారంలో వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

ACC 

ICICI BANK

CRISIL

ICICIPRULI

NESTLEIND

SWARAJENG

TATASTLLP

TATASTLBSL

CYIENT

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

HDFC BANK, Adani Green Energy, MindTree.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 31,120, రెసిస్టెన్స్ లెవెల్ 32,650 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,250 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,540 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కొవిడ్ పరిణామల కారణంగా దేశీయంగా, అంతర్జాతీయంగా సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అలాగే సింగపూర్ నిఫ్టీ 155 పాయింట్లు కోల్పోయి నష్టాల్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

 

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *