బలంగా గ్లోబల్ సూచీలు… మన మార్కెట్లను ముందుకు తీసుకెళ్తాయా?

దేశీయంగా ఎటువంటి సానుకూలతలు లేనప్పటికీ అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో నిన్నటి మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. దీనికి ప్రధాన కారణంగా అమెరికాలో వివిధ కంపెనీల త్రైమాసిక ఫలతాలు మంచి లాభాల్లో ఉండటం అలాగే హెచ్ డి ఎఫ్ బ్యాంక్ వచ్చే 12 నెలల్లో బాండ్ల జారీ ద్వారా సుమారు రూ.50,000 కోట్ల రూపాయల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలపడంతో బ్యాంక్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అయ్యి షేరు 2.54 శాతం పెరిగింది. అలాగే శనివారం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ రోజు కూడా బ్యాంక్ నిఫ్టీ ఒడుదుడుకుల మధ్య లాభాల్లో కొనసాగే అవకాశం వుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి లాక్ డౌన్ ఉండబోదని స్పష్టం చేయడంతోపాటు కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవ్వడంతో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మన మార్కెట్లు పాజటివ్ గా ముందుకు కొనసాగే అవకాశాలున్నాయి.

న్యూస్ స్టాక్స్:

విప్రో క్యూ 4 ఫలితాలు: దిగ్గజ ఐటీ సంస్థ విప్రో మార్చి త్రైమాసికానికి గాను గణనీయమైన లాభాలను ఆర్జించింది. నికర లాభం 28% పెరిగి 2,972.3 కోట్ల రూపాయలకు చేరుకుంది.

ఎల్ అండ్ టి: దిగ్గజ కంపెనీ లార్సెన్ & టౌబ్రో లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో రూ.2,500 కోట్ల విలువచేసే ఆర్డర్లు తమకు లభించినట్లు సంస్థ తెలిపింది.

టాటా స్టీల్: టాటా స్టీల్ లిమిటెడ్ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఈస్ట్ మిడ్‌లాండ్స్‌లో స్టీల్ ట్యూబ్ తయారీ సైట్ కోసం అతి భారీ ఒప్పందం కుదుర్చకుంది. 150 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నట్లు తెలిపింది. దీని విలువ వేల కోట్ల రూపాయలలో ఉన్నట్లు అంచనా.

జిఇ పవర్ ఇండియా: ఎన్‌టిపిసి జిఇ పవర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 50% వాటాను కొనుగోలు చేయడానికి జిఇ పవర్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. దీని విలువ రూ.7.2 కోట్ల రూపాయలు.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Wipro, Tata Steel, L&T, HDFC Bank, GE Power, PEL

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 31,300, రెసిస్టెన్స్ లెవెల్ 32,650 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,370 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,620 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో మార్కెట్లు రాణిస్తున్నాయి అలాగే సింగపూర్ నిఫ్టీ కూడా ఈ రోజు నష్టాలతో మొదలై లాభాల్లో సూచీలు పయనిస్తున్నాయి కాబట్టి మన మార్కెట్లు ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *