వాలటల్టీ దిశగా మార్కెట్లు? బలహీనంగా గ్లోబల్ సూచీలు

వాక్సినేషన్ ప్రకియపై కేంద్ర తీసుకున్న విధివిధానాలతో మంగళవారం మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఇది ఇలా వుంటే మన దేశంలో కరోనాపై కొన్ని రాష్ట్రాలు కఠిన అంక్షలు విధించడంతో పాటు అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లో లాక్ డౌన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో బలహీనంగా మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి.

 

న్యూస్ స్టాక్స్:

ఇన్ఫోసిస్ : ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ క్యూ 4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టుగా రూ.5,076 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. షేర్ల బైబ్యాక్ కోసం రూ.9,220 కోట్ల ప్రణాళికను ప్రకటించింది. ఒక్కో షేరుకు గరిష్ఠంగా రూ.1750 చొప్పున 5,25,71,428 షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. అలాగే ఒక్కో షేరుకు రూ.15 డివిడెంట్ ను ప్రకటించనుంది.

మారుతీ సుజుకీ: సీఎన్ జీ కార్ల విక్రయాల్లో గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1.57 లక్షల కార్లు విక్రయించినట్లు సంస్థ తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Infy, Maruti Suzuki, Bharati Airtel

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 30,870, రెసిస్టెన్స్ లెవెల్ 31,920 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,280 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,620 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ సూచీలు మరియు సింగపూర్ నిఫ్టీ 115 పాయింట్ల నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *