కరోనా ఘాతుకం…పతనం ఇంకా ఎంతవరకు?

నిన్నటి మార్కెట్ ను స్టాక్ మార్కెట్ కంటే కరోనా మార్కెట్ అంటే బాగుంటుందేమో… నిన్నటి ట్రేడింగ్ సెషన్లో మార్కెట్లో అమ్మకాల మోత మోగింది. ట్రేడింగ్ ఆరంభమే భారీ గ్యాప్ అప్ తో మార్కెట్లు ప్రారంభమై చివరి వరకు అమ్మకాలు కొనసాగాయి. దీంతో బ్యాంక్ నిఫ్టీ 1656 (ఒకనొక దశలో 1800 పాయింట్లపైగా) నష్టపోయింది. అలాగే నిఫ్టీ 524 పాయింట్లు కోల్పోయి 14,310 వద్ద స్థిరపడింది. ఐటీ కంపెనీల ఫలితాలు ఉన్నప్పటికీ మార్కెట్ రివర్స్ అవుతుందని ఇప్పట్లో చెప్పలేం. స్టాక్ బేసిడ్ ట్రేడ్ కొనసాగే అవకాశం వుంది.

న్యూస్ స్టాక్స్:

టిసిఎస్ ఫలితాలు అదుర్స్: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం సంవత్సరానికి 14.8% గాను నికర లాభం 9,246 కోట్లకు పెరిగింది. అదే సమయంలో ఐటి సంస్థ ఆదాయం 9.4% పెరిగి 43,705 కోట్ల రూపాయలకు చేరింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మరియు ఇన్సూరెన్స్ (బిఎఫ్‌ఎస్‌ఐ) నుంచి కంపెనీ ఆదాయం 15% పెరిగి రూ .17,559 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా టిసిఎస్ బోర్డు ఒక్కో షేరుకు 15 రూపాయల తుది డివిడెండ్‌ను ప్రకటించనుంది. 

డాక్టర్ రెడ్డి : రష్యా యొక్క స్పుత్నిక్ వి కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను దేశంలో వాడాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) యొక్క సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సిఫార్సు చేసింది.  డాక్టర్ రెడ్డిస్ వాక్సిన్ తయారీకి ముందుగానే ఒప్పందం చేసుకోవడంతో షేరు ధర ఇంకా పెరిగే అవకాశం వుంది.

మ్యాన్ ఇండస్ట్రీస్: మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్ దేశీయ హైడ్రోకార్బన్ రంగం నుండి 766 కోట్ల రూపాయల ఆర్డర్‌ను పొందుకుంది.

జెఎంసి ప్రాజెక్టు: జెఎంసి ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ రూ.1,262 కోట్ల రూపాయల విలువైన భవన నిర్మాణ ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకుంది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

TCS, HDFC Bank, Dr.Reddy, MAN Industries, JMC Project, Coforge

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 30,080, రెసిస్టెన్స్ లెవెల్ 31,540 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,120 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,520 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయ, అంతర్జాతీయ సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *