నష్టాల్లో SGX Nifty… పతనం దిశగా సూచీలు? కరోనాతో సతమతమవుతున్న రాష్ట్రాలు

గత వారం అంతర్జాతీయంగా ఎటువంటి బలమైన సంకేతాలు లేకపోవడం, కరోనా భయాందోళనలు, బాండ్ ఈల్డ్స్ పెరుగుదల కారణంగా మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. ఈ వారం కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రధాన కారణంగా కరోనా కేసులు భారతదేశ మొత్తంగా రోజుకు లక్షకు పైగా నమోదవుతున్నాయని ఫిన్ టెక్ రేటింగ్ సంస్థ చేసిన సర్వేలో స్పష్టమైంది. దీని ప్రభావం ఎకానామిక్ రికవరీపై తీవ్ర ప్రభావాలుంటాయిని ఈ సంస్థ చేసిన సర్వేలో తేల్చింది. అలాగే మహరాష్ట్రలో 15 రోజుల పాటు లాక్ డౌన్ కఠినతరం చేయనున్నారు. మరికొన్ని రాష్ట్రాలలో కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశాం వుంది. ఈ వారంలో ఐటీ కంపెనీల రిజల్స్ ఉండటంతో నిఫ్టీ 14600-15000 మధ్యలో తీవ్ర హెచ్చు, తగ్గులతో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ వారంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవుకావడంతో 4 రోజులు మాత్రమే ట్రేడింగ్ పరిమితం కానుంది. ఇక అంతర్జాతీయంగా అమెరికా కన్సూమర్ ఇన్ఫేలేషన్, చైనా జీడీపీ, ముడిచమురు ధరలు మార్కెట్లను దిశానిర్దేశనం చేయనున్నాయి.

ఈ వారంలో కంపెనీల ఫలితాలు:

సోమవారం – టీసీఎస్

బుధవారం – ఇన్ఫోసిస్

గురువారం – విప్రో

శుక్రవారం – మైండ్ ట్రీ

శనివారం – హెచ్ డి ఎఫ్ సీ బ్యాంక్

న్యూస్ స్టాక్స్:

ఎల్ అండ్ టీ: సౌదీ అరేబియాలో 1.5Gw ప్లాంట్‌ను నిర్మించడానికి ఎల్ అండ్ టి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని విలువ ఎంత వుంటుందన్నది తెలియాల్సివుంది.

ఇన్ఫోసిస్ : ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్ పై ఈ నెల 14 న నిర్ణయం వెలువడనుంది. 2019 ఆగష్టులో కంపెనీ రూ.8,260 కోట్లతో 11.05 కోట్ల షేర్లకు బైబ్యాక్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

HDFC Bank, Infy, L&T, Wipro

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్:

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 31,600, రెసిస్టెన్స్ లెవెల్ 33,500 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,720 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,950 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా, అంతర్జాతీయంగా సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. లాగే సింగపూర్ నిఫ్టీ 14,591తో 300 పాయింట్ల నష్టాల్లో కొనసాగుతుంది కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *