కాన్సాలిడేషన్ దిశగా సూచీలు? కరోనా సందిగ్దంలో మార్కెట్లు

నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో నిఫ్టీ తీవ్ర ఒడుదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ ఎక్సపయిరీ హై వాలటలీటి మధ్య ముగిసింది. ఐటీ, లోహ షేర్లు రాణించడంతో వరుసగా మూడో రోజు కూడా మార్కెట్ లాభాల్లోనే ముగిసాయి. కరోనా భయాందోళనలతో ఆరంభంలో లాభాల్లో ఉన్న సూచీలు నష్టాలతో బలహీనంగా ట్రేడ్ అయ్యాయి.  స్టీల్ ధరలు పెరుగుతాయనే వార్త రావడంతో మెటల్ షేర్లలో ర్యాలీ కొనసాగతుంది అలాగే రిటైల్ ఇన్వెస్టర్లు మళ్ళీ  మ్యూచువల్ ఫండ్స్ లో తిరిగి పెట్టుబడులు పెడుతుండటం వల్ల మార్చి నెలలో సుమారు రూ.9,115 కోట్లు మార్కెట్లోకి పంప్ చేశారు. వీటి ఆధారంగా మార్కెట్ కరోనా భయాలను పట్టించుకోకపోతే నిఫ్టీ సూచీలు మరింతగా దూసుకెళ్ళే అవకాశం లేకపోలేదు.

 

న్యూస్ స్టాక్స్:

జైడస్ కాడిలా: ప్రముఖ ఔషధ సంస్థ జైడస్ కాడిలా క్యాన్సర్ మరియు రక్తపోటు చికిత్సకు నివారించే ఇబ్రూటినిబ్ క్యాప్సూల్స్ కు యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి అనుమతి పొందింది.

కల్పటారు పవర్: కల్పటారు పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ (కెపిటిఎల్) బ్రెజిల్ కి చెందిన ఫాస్టెల్ ఎంగెన్‌హారియా ఎల్టిడా సంస్థలో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది.

మిండా కార్ప్: తమ వ్యాపార విస్తరణకు 250 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు కంపెనీ తన త్రైమాసిక నివేదికలో ప్రకటించింది. గత త్రైమాసికంలో కంపెనీ 19 శాతం లాభాలను ఆర్జించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Panacea biotec, zydus cadila, Kalpapower, MindaCorp. Dalmia Sugars, Titan.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,500, రెసిస్టెన్స్ లెవెల్ 33,850 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,800 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,000 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ మార్కెట్ ని కరోనా భయాలు వెనక్కి లాగుతున్నాయి అలాగే సింగపూర్ నిఫ్టీ నష్టాల్లో ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ మూమెంట్ను జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *