సానుకూలంగా ఆర్‌బిఐ నిర్ణయాలు… మార్కెట్లను పరుగులు పెడతయా?

ఆర్‌బిఐ సానుభూతితో కూడిన నిర్ణయాలు మన మార్కెట్లను ఉత్సహపరిచే విధంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. కరోనా కష్ట కాలంలో వడ్డీ రేట్లు యథాతదంగా ఉంచుతూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల నిన్నటి ట్రేడింగ్ సెషన్ లాభాల్లో ముగిసింది. మరి అదే జోరు కొనసాగుతుందో, లేదో వేచి చూడాలి. దేశీయంగా, అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరుగుదల, భయాందోళలను పరిగణలోకి తీసుకోకుండా మరింత ముందుకు మార్కెట్లు వెళ్ళే అవకాశాలు లేకపోలేదు.

న్యూస్ స్టాక్స్:

ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్: ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్యూఐపి ఇష్యూ ద్వారా రూ .3,000 కోట్లు సమీకరించింది. వీటిని కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోనున్నట్లు బ్యాంక్  తెలిపింది.

టాటా పవర్: టాటా పవర్ సోలార్ రెట్టింపు తయారీ సామర్థ్యం 1,100 మెగావాట్లకు పెంచనున్నట్లు సంస్థ తెలిపింది.

రైల్‌టెల్ కార్ప్: రైల్‌టెల్ కార్ప్ 34.37 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్‌లను వివిధ సంస్థల నుంచి సొంతం చేసుకుంది.

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ : రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ జర్మనీకి చెందిన సంస్థ నుంచి సుమారు రూ.745 కోట్లు విలువ చేసే వర్క్ ఆర్డర్ తమకు లభించినట్లు సంస్థ తెలిపింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Tata Power, IDFC Bank, HDFC Bank, Railtel, Rajesh Exports. Bharati Airtel.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,620, రెసిస్టెన్స్ లెవెల్ 33,850 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,700 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,080 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

రిజర్వ బ్యాంకు నిర్ణయాలు సానుకూలంగా ఉన్నప్పటికీ మరో వైపు కరోనా భయాలు వెంటాడుతున్నాయి కాబట్టి మార్కెట్లు స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లు సైతం నష్టాల్లోనే ముగిసాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ను జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడే చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *