నిఫ్టీకి దన్నుగా ఐటీ ఫలితాలు? కరోనా విజృంభణతో మళ్ళీ లాక్ డౌన్ దిశగా రాష్ట్రాలు

గత వారంలో మార్కెట్లు నష్టాల్లో కొనసాగినప్పటికీ చివరిలో జీఎస్టీ వసూళ్ళు పెరగడం, ఆటో సెక్టార్ ఫలితాలు లాభదాయకంగా ఉండటం, అమెరికాలో మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడుల పెడుతున్నట్లు బైడెన్ ప్రకటించడం వంటి బలమైన కారణాల వల్ల నిఫ్టీ 176 పాయింట్ల లాభంతో ముగిసింది.  ఈ వారం మార్కెట్లకు బుధవారం వెలువడనున్న ఆర్ బి ఐ పరపతి విధాన సమీక్షా నిర్ణయాలు మరియు టిసియస్, మైండ్ ట్రీ, ఇన్ఫోసిస్ ఫలతాలు కీలకం కానున్నాయి. ఐటీ ఫలితాలు రాణించినట్లయితే నిఫ్టీ 15400పైగా ట్రేడ్ అయ్యే అవకాశాలుంటాయి. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో జపాన్లో మళ్ళీ కొత్తరకం కరోనాతో లాక్డౌన్ విధించారు. అలాగే మన దేశంలో మహారాష్ట్రలో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది. 

న్యూస్ స్టాక్స్:

అదానీ ఎంటర్ప్రైజెస్: అదానీ ఎంటర్ప్రైజెస్ మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కో లిమిటెడ్ (మహాజెంకో) తో బొగ్గు గని అభివృద్ధి మరియు నిర్వహణ కోసం 34 సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకుంది.

బజాజ్ ఆటో: బజాజ్ ఆటో లిమిటెడ్ తన మోటారు సైకిళ్ల హోల్‌సేల్ పంపకాలలో 23.5% నెలవారీ (MoM) పెరుగుదలను మార్చిలో నివేదించింది. ఫిబ్రవరిలో 1.98 లక్షల యూనిట్లతో పోలిస్తే ఈ నెలలో కంపెనీ 3.69 లక్షల యూనిట్లను విక్రయించింది. మొత్తం వాణిజ్య వాహనాల అమ్మకాలు మార్చి 2021 లో 39,315 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

బెల్ : కోవిడ్ -19 మహమ్మారి మరియు పోటీదారుల మధ్య ఎదురైన సవాళ్లు ఉన్నప్పటికీ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో సుమారు 13,500 కోట్ల రూపాయల రికార్డు టర్నోవర్ సాధించినట్లు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తెలిపింది.

ఐజిఎల్: ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజిఎల్) ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డిటిసి) కు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సిఎన్‌జి) సరఫరా చేయడానికి దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. గ్యాస్ సరఫరా ఒప్పందం డిసెంబర్ 2030 వరకు ఉంటుంది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Adani Enterprises, BEL, IGL, Bajaj Auto, Indigo, Tata Consumer, JSW Steel.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 33,250, రెసిస్టెన్స్ లెవెల్ 34,500 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,700 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,080 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూలతలు ఉన్నప్పటికీ మరో వైపు కరోనా కేసులు అధికమవుతుండటతో మరణాల రేటు కూడా పెరగడం మదుపరులను కలవరపాటుకు గురిచేస్తుంది కాబట్టి ఈ దిశగా మార్కెట్లు స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది. మార్కెట్ మూమెంట్ను జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడే చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *