బ్లాక్ మండే? భారీగా పడిపోయిన అంతర్జాతీయ సూచీలు

దేశీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ రోజు మార్కెట్ తీవ్ర నష్టాలు చూసే అవకాశం వుంది. కరోనా కేసులు ప్రభలడంతోపాటు మరణాల రేటు రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో మరోసారి ఇండియాలో లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఇతర దేశాలు కూడా ఇండియా నుంచి వచ్చే వారిపై కఠిన ఆంక్షలు విధించడంతో పరిస్థితులు తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ఇదిలా వుంటే మార్కెట్ లీడర్ రిలయన్స్ క్యూ4 ఫలితాలు మార్కెట్ ని ఉత్సహ పరిచేవిధంగా వున్నాయి. అలాగే అధికార పార్టీ వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పరాజయం కావడం మార్కెట్ సెంట్మెంట్ ని దెబ్బదీసింది. మరోపక్క సింగపూర్ నిఫ్టీ భారీ నష్టాల్లో 200 పాయింట్లకు పైగా కోల్పోయి 14,460 వద్ద నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఏది ఏమైనా ఈ రోజు మార్కెట్లకు ఈ రోజు బ్లాక్ మండే తప్పేట్లు లేదు.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

APOLLOTRICITADELGODREJPROP
IDBIKOTAKBANKVBL
TATACHEMJK Agri GeneticL&T Technology
SBI Life InsuraMHRILSupreme Ind

 

న్యూస్ స్టాక్స్:

రిలయన్స్ ఇండస్ట్రీస్: మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఫలితాలు ఆదరగొట్టాయి. మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ .13,227 కోట్లతో 108% శాతం వృద్ధిని కంపెనీ సాధించింది. ఈ సందర్భంగా RIL బోర్డు ఒక్కో షేరుకు 7 రూపాయల తుది డివిడెండ్ ప్రకటించింది.

ఇండస్‌ఇండ్ బ్యాంక్ : మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ నికర లాభం 876 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ సందర్భంగా ఇండస్ఇండ్ బ్యాంక్ బోర్డు ఒక్కో షేరుకు 5 రూపాయల డివిడెండ్ ప్రకటించింది.

మారికో: మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ .227 కోట్లకు 14.07 శాతం పెరిగిందని మారికో లిమిటెడ్ తెలిపింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 34.49% శాతం పెరిగి సంవత్సర ఆదాయం 2,012 కోట్లకు చేరుకుంది.

అతుల్: అతుల్ లిమిటెడ్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ .175.05 కోట్లకు 23.9% పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 20 రూపాయల డివిడెండ్‌ను ఆమోదించింది.

దాల్మియా భారత్: మార్చి (క్యూ 4) తో త్రైమాసికంలో డాల్మియా భారత్ లిమిటెడ్ నికర లాభం రూ.640 కోట్ల రూపాయలకు పెరిగింది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ .1.33 డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Reliance, CDSL, Zensar Technologies, Atul, Marico.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 32,480, రెసిస్టెన్స్ లెవెల్ 33,270 గా పరిగణించాల్సి వుంటుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 14,421 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 14,855 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

అంతర్జాతీయ సూచీలు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *