నిఫ్టీ 16,000?సానుకూలంగా గ్లోబల్ మార్కెట్లు

దేశీయంగా, అంతర్జాతీయంగా అందుకున్న సంకేతాలతో గత వారం మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ వారం కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశాలున్నాయి. దేశీయంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం, లాక్ డౌన్లు ఎత్తివేయడంతోపాటు ఆంక్షలు సడలింపులతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాగే అంతర్జాతీయంగా అమెరికా మార్కెట్ల సూచీలు సానుకూలంగా వుండటంతోపాటు విదేశీ ఇన్వెస్టర్లు సైతం కొనుగోళ్ళకు మెగ్గు చూపుతున్నారు. ఇక ప్రతికూల అంశాలను పరిశీలిస్తే కరోనా కొత్త వేరియంట్లతో వివిధ దేశాలను కలవర పెడుతుంది. దీంతో మార్కెట్లో కొద్దిపాటి భయాందోళనలు నెలకొనే అవకాశాలున్నాయి. అలాగే ఈ వారంలో జూన్ నెలకు సంబంధించిన ఆటోమొబైల్ గణాంకాలు గురువారం విడుదలకానున్నాయి. గడిచిన రెండు నెలలు లాక్ డౌన్ లు వుండటంతో నెలవారీ గణాంకాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు. బ్యాంకింగ్ షేర్లు బలంగా వుంటే నిఫ్టీ 16,000 మార్కును తాకే అవకాశాలున్నాయి. అదే విధంగా ఈ వారంలో వివిధ దేశాల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, అమెరికాలో రియల్ ఎస్టేట్, మౌలికరంగ గణాంకాలు వెలువడనున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సూచీలు సానుకూలంగా కదలాడిన ఒడుదుడుకులు ఎదుర్కొనే అవశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Career PointWelspun CorpHindustan Aeron
India GelatineKCP SugarLakshmi Mills
NALCOPremier ExploTamilnadu Petro

 

న్యూస్ స్టాక్స్:

థైరోకేర్‌: ఇండియన్ హెల్త్‌కేర్ స్టార్టప్ అయిన ఫార్మ్‌ఈసీ, డయాగ్నస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ థైరోకేర్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో 66.1% వాటాను రూ .4,546 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఫార్మ్ ఈసీ మాతృ సంస్థ ఎపిఐ హోల్డింగ్స్ లిమిటెడ్ 66.1% వాటాను థైరోకేర్ ప్రమోటర్ల నుండి ఒక్కో షేరుకు 1,300 రూపాయలకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

ఒఎన్‌జిసి: దిగ్గజ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ కంపెనీ ఒనెన్జీసీ మార్చి 2021 (క్యూ 4 ఎఫ్‌వై 21) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 6,734 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 16% తగ్గి కంపెనీ వార్షిక ఆదాయం 11,246 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా ఒఎన్‌జిసి బోర్డు ఒక్కో షేరుకు 1.85 తుది డివిడెండ్‌ను సిఫారసు చేసింది.

ఐజిఎల్: IGL యొక్క మొత్తం అమ్మకాల వాల్యూమ్‌లు Q4 FY21 లో 8% YOY 614 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు పెరిగి క్యూ 4 ఎఫ్‌వై 21 లో ఆదాయం రూ .1,700.52 కోట్లుకు చేరుకుంది. మార్చి 31, 2021 (ఎఫ్‌వై 21) తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 11% తగ్గి 1,005 కోట్లకు పరిమితమైంది. ఐజిఎల్ బోర్డు ఒక్కో షేరుకు రూ .3.6 డివిడెండ్ ప్రకటించింది.

అశోక్ లేలాండ్: అశోక్ లేలాండ్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఇవి) వ్యాపారం కోసం ఇండియాలో ‘మదర్ ఇ.వి’ ప్లాంట్‌ను యుకెకు చెందిన సంస్థతో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Ashok Leyland, ONGC, Lupin, IGL, Shilpa Medicare

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 35,250, రెసిస్టెన్స్ లెవెల్ 35,550 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,770 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,960 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *