స్తబ్ధుగా సూచీలు? బలహీనంగా ప్రపంచ మార్కెట్లు

దేశీయ, అంతర్జాతీయ సానుకూల అంశాలతో నిన్నటి మార్కెట్ వారం ఆరంభంలో లాభాలతో మొదలైంది. కార్పొరేట్ కంపెనీలు మెరుగైన ఫలితాలు వెల్లడించడం, యూఎస్ సెనేట్ ఈ వారంలో $ 550 బిలియన్ (రూ. 40.7 లక్షల కోట్లు) మౌలిక సదుపాయాల ప్యాకేజీకి ఆమోదం తెలపనున్న నేపథ్యంలో యూఎస్ మార్కెట్లతో పాటు ప్రపంచ మార్కెట్ల సూచీలు సానుకూలంగా స్పందించాయి. అలాగే జాతీయంగా తయారీ రంగం సూచీ గణాంకాలు మూడు నెలల గరిష్ఠానికి చేరడం తయారీ రంగంలో వృద్ధిని కనబరిచింది దీంతో పాటుగా ఆటో మొబైల్ గణాంకాలు ఆకర్షణీయంగా వుండటంతో నిఫ్టీ లాభాల్లో రాణించింది. ఇదిలావుంటే ఈ రోజు ఆసియా మార్కెట్లు టోక్యో, షాంఘై మార్కెట్లు బలహీనంగా వుండటంతో నష్టాల్లో ఆరంభమయ్యాయి దీంతో సింగపూర్ సైతం నిఫ్టీ నష్టాల్లో  ట్రేడ్ కొనసాగుతుంది.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Adani EnterprisAdani PortsAlkyl Amines
Bajaj HealthcareBank of IndiaBharti Airtel
Dabur IndiaEverest IndGodrej Prop
Kajaria CeramicNOCILTATA Cons. Prod

 

న్యూస్ స్టాక్స్:

హెచ్‌డిఎఫ్‌సి: హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) నికర లాభం 1.7% శాతంతో తగ్గి రూ. 3,001 కోట్లకు పడిపోయింది. గత త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 5.6% తగ్గింది. అదే కాలంలో దాని నికర వడ్డీ ఆదాయం (NII) 22.2% YoY (లేదా 2% QoQ) పెరిగి రూ .4,147 కోట్లకు పెరిగింది. నిర్వహణలో ఉన్న హెచ్‌డిఎఫ్‌సి ఆస్తులు (ఎయుఎమ్) క్యూ 1 లో 8% పెరిగి రూ. 5.74 లక్షల కోట్లకు పెరిగాయి.

ఇమామి: ఇమామి లిమిటెడ్ జూన్ తో ముగిసిన త్రైమాసికానికి (Q1 FY22) కన్సాలిడేటెడ్ నికర లాభం 96.4% శాతం పెరుగుదలతో రూ.77.79 కోట్లకు చేరింది. సంస్థ కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయం ఇదే సమయంలో 37.3% శాతం పెరిగి రూ. 660.95 కోట్లకు పెరిగింది. FMCG కంపెనీ అయిన ఇమామి EBITDA క్యూ 1 లో 38% శాతంతో వృద్ధి చెంది రూ .170 కోట్లకు చేరింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) జూన్ తో ముగిసిన త్రైమాసికానికి నికర లాభం 232% పెరిగింది. గత త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 75% శాతం పెరిగింది. ఇదే కాలంలో దాని నికర వడ్డీ ఆదాయం (NII) 6.5 % శాతం పెరిగి రూ.7,226 కోట్లకు పెరిగింది.

వరుణ్ బెవరేజెస్: వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ (VBL) జూన్ తో ముగిసిన త్రైమాసికానికి (నికర లాభం) ఏకీకృత నికర లాభం 123% శాతం పెరిగి రూ. 318.8 కోట్లకు చేరింది. సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఇదే కాలంలో 49.4% పెరిగి రూ .2,449.85 కోట్లకు పెరిగింది. Q2 CY21 లో మొత్తం అమ్మకాలు 45.4% శాతం పెరిగాయి. ఈ సందర్భంగా VBL బోర్డు ఒక్కో షేరుకు రూ .2.5 మధ్యంతర డివిడెండ్‌ని సిఫార్సు చేసింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

VBL, PNB, Emami, Adani Ports, Dabur, Kajaria Ceramics

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,600, రెసిస్టెన్స్ లెవెల్ 34,880 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,830 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,920 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *