స్తబ్ధుగా సూచీలు? కీలకం కానున్న రిలయన్స్ ఫలితాలు

దేశీయంగా, అంతర్జాతీయంగా అందుకున్న బలమైన సంకేతాలతో నిన్నటి ట్రేడింగ్ ఆద్యంతం లాభాలబాటలోనే కొనసాగింది. దీంతో ఒకే రోజు నిఫ్టీ 200పైగా లాభాపడి వరుస నష్టాలకు బ్రేక్ వేసింది. స్పెషాలిటీ స్టీల్ కోసం కేంద్రం ప్రకటించిన పిఎల్‌ఐ పథకాన్ని రూ.6,322 కోట్లకు  కేబినెట్ ఆమోదం తెలపడంతోపాటు ఈ పథకం కింద సుమారు రూ .40 వేల కోట్ల పెట్టుబడులు రానున్నయనే సంకేతాలతో మెటల్ షేర్లను మదుపరులు భారీగా కొనుగోళ్ళు చేశారు. అదే విధంగా దిగ్గజ కార్పొరేట్ సంస్థల ఫలితాలు మెరుగ్గా ఉండటం, ఐటీ సంస్థల్లో పలు భారీ ఒప్పందాలు జరుగుతుండటంతో మార్కెట్ కి కలిసొచ్చింది. దీంతో నిఫ్టీ పడిన ప్రతిసారీ మద్దతు స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్ళుకు మొగ్గు చూపుతున్నారు. ఇదిలావుంటే అంతర్జాతీయంగా యూస్ జాబ్ డేటా ఆశించినంతగా లేకపోవడంతో అమెరికా మార్కెట్లు నిరాశగా ట్రేడయ్యాయి. ప్రపంచ మార్కెట్ల సూచీలు సైతం మిశ్రమంగా ఫ్లాట్ గా ముగిశాయి. దీంతో సింగపూర్ నిఫ్టీ కాన్సాలిడేషన్లో లాభాల నుంచి నష్టాల్లో ట్రేడ్ కొనసాగుతుంది. ఈ రోజు మార్కెట్ లీడర్ రిలయన్స్ ఫలితాలు మార్కెట్ కి కీలకం కానుండటంతో నిఫ్టీ  గ్రీన్ లో ముగిస్తుందో, లేదో వేచి చూడాల్సిందే!

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

ABB Power ProduAmbuja CementsAtul
CG ConsumerDynamatic TechFederal Bank
JSW SteelPanacea BiotecReliance
SBI CardABB PowerUnited Spirits

 

న్యూస్ స్టాక్స్:

అల్ట్రాటెక్ సిమెంట్ : అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ జూన్తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) నికర లాభంలో 114.4 శాతం వృద్ధిని సాధించి 1,703 కోట్ల ఆదాయానికి చేరుకుంది. సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 54% పెరిగి 11,829 కోట్ల రూపాయలకు చేరుకుంది.

బజాజ్ ఆటో: బజాజ్ ఆటో లిమిటెడ్ జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) స్వతంత్ర నికర లాభంలో 101.2 శాతం వృద్ధిని సాధించి 1,061.2 కోట్లకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 20.3% తగ్గింది. సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 139.88% పెరిగి 7,386 కోట్ల రూపాయలకు చేరుకుంది. బజాజ్ ఆటో క్యూ 1 లో దాదాపు 3.42 లక్షల యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది దీంతో 19.7% శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకుంది.

ఐఇఎక్స్: IEX నికర లాభం జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో (క్యూ 1 ఎఫ్‌వై 22) 49 శాతం పెరిగి సంస్థ ఆదాయం రూ .62.8 కోట్లకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 2.1% పెరిగింది. అదే సంవత్సర ఆదాయం 26.86% YOY (లేదా 2.5% QoQ) పెరిగి 102.87 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సందర్భంగా కంపెనీ ఒక్కో షేరుకు రూ .1.5 తుది డివిడెండ్ ప్రకటించింది.

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Reliance, Ambuja Cements, Panacea Biotec, JSW Steel, Adani Ports

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,550, రెసిస్టెన్స్ లెవెల్ 34,860 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 15,800 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,895 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *