స్తబ్దుగా సూచీలు? ప్రతికూలంగా గ్లోబల్ సూచీలు

నిన్నటి ట్రేడింగ్ లో అదానీ షేర్ల దుమారంతో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పతనమై రిలయన్స్ అండతోపాటు అంతర్జాతీయ సంకేతాలతో మళ్ళీ రికవరీ బాట పట్టాయి. అదే విధంగా అదానీ కంపెనీ నుంచి తప్పుడు వార్తల గూర్చి స్పష్టత రావడంతో అదానీ గ్రూపునకు సంబంధించిన అన్ని షేర్లు మద్దతు స్థాయిల వద్ద కొనుగోళ్ళు రావడంతో వెంటనే రికవరీ అయ్యాయి. ఇదిలావుంటే రిటైల్  ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో పెరగడం మార్కెట్ ని మూవ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయంగా యూస్ మార్కెట్లు ఫెడ్ రిజర్వు నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో స్తబ్దుగా కదలాడి స్వల్ప డొజోన్స్ నష్టాల్లోనూ నాస్ డాక్ ఫ్యూచర్స్ లాభాల్లో ముగిసింది. దేశీయంగా ఎగుమతులు, దిగుమతుల గణాంకాలు ఈ రోజు వెలువడనున్నాయి. దీంతో ఈ రోజు సూచీలు కాన్సాలిడేషన్ దిశగా ఒడుదుడులకు మధ్య లాభాల్లో ట్రేడ్ కొనసాగే అవకాశాలున్నాయి.

ఈ రోజు వెలువడనున్న కంపెనీల ఫలితాలు:

Agarwal IndEasy TripEnt Network Ind
Jubilant FoodLIC Housing FinWhirlpool

 

న్యూస్ స్టాక్స్:

న్యూస్ స్టాక్స్:

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబి) మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రెండు రెట్లు పెరిగి 349.77 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 64.31% పెరిగింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 109.75% పెరిగి 831.47 కోట్ల రూపాయలకు చేరుకుంది.

కోల్ ఇండియా: కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 1.1 శాతం తగ్గి రూ .4,586.78 కోట్లకు పరిమితమైంది. ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ ఆదాయం నికర లాభం 24% తగ్గి 12,699.89 కోట్లకు చేరుకుంది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు 3.5 రూపాయల తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

కజారియా సెరామిక్స్: కజారియా సెరామిక్స్ మార్చి (క్యూ 4) తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 168.7% పెరుగుదలను 131.17 కోట్ల రూపాయలకు చేరుకుంది. సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 46.08% పెరిగి 952.51 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 21.83 శాతం పెరిగి 308.90 కోట్లకు పెరిగింది.

 

ఇంట్రాడేకి ట్రేడింగ్ స్టాక్స్:

Adani Ports, Kajaria Ceramics, IOB, Natco Pharma, Amara Raja Batteries, Jubilant Food.

 

బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ లెవెల్స్ :

బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 34,680, రెసిస్టెన్స్ లెవెల్ 35,200 గా పరిగణించాల్సి వుంటుంది. అదే విధంగా నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 15,780 వద్ద మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ 15,860 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా, అంతర్జాతీయంగా కీలక పరిణామాల జరగనున్న నేపథ్యంలో మార్కెట్ మూమెంట్ జాగ్రత్తగా గమనిస్తూ ట్రేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్!

_______________________________________

Disclaimer: పైన పేర్కొన్న స్టాక్స్ యొక్క వివరాలు మార్కెట్లో బ్రోకింగ్ సంస్థలు సూచించబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపికలో మీ ఫైనాన్సియల్ అడ్వైసర్ సలహాలు, సూచనలు పాటించ మనవి.

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *